English | Telugu

బ్ర‌హ్మోత్స‌వానికి అడ్డుప‌డుతున్న బ‌న్నీ..!

బ్ర‌హ్మోత్స‌వం విడుద‌ల‌కు రెడీ అయిపోయింది. మ‌రికొద్ది గంట‌ల్లో థియేట‌ర్ల ద‌గ్గ‌ర పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొన‌బోతోంది. అయితే.. మ‌హేష్ సినిమాకి అనుకొన్న సంఖ్య‌లో థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌ని టాక్‌. మ‌రీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర‌లో బ్ర‌హ్మోత్స‌వంకి థియేట‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. స‌రైనోడు సినిమా వ‌ల్లే మ‌హేష్‌కి థియేట‌ర్లు దొర‌క‌డం లేదట‌. బన్నీ గ‌త సినిమాలు ఉత్త‌రాంధ్ర‌లో స‌రిగా ఆడ‌లేదు. స‌రైనోడు మాత్రం అక్క‌డ మంచి హిట్ కొట్టింది. ఈసినిమాని ఉత్త‌రాంధ్ర‌లో ఎక్కువ రోజులు ఆడించి త‌న రికార్డును మెరుగు ప‌ర‌చుకోవాల‌నుకొంటున్నాడు బ‌న్నీ. క‌నీసం అక్క‌డ‌ 50 రోజులు ఆడించేయాల‌ని బ‌న్నీ ప్లాన్ వేశాడు. బ్ర‌హ్మోత్స‌వం వ‌ల్ల ఆ థియేట‌ర్ల‌లో సినిమాని తీసేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే... స‌రైనోడు ఆడుతున్న థియేట‌ర్ల‌ను బ్ర‌హ్మోత్స‌వంకి ఇవ్వ‌కుండా బ‌న్నీ అడ్డు ప‌డుతున్నాడ‌ని టాక్‌. దాంతో మ‌హేష్ సినిమాకి థియేట‌ర్లు దొర‌క‌డం లేదు. పంపిణీదారులు, థియేట‌ర్ల య‌జ‌మానులు`మాకు బ్ర‌హ్మోత్స‌వం కావాలి` అని ప‌ట్టుబ‌డుతున్నా...ఆ థియేట‌ర్ల‌న్నీ గీతా ఆర్ట్స్ చేతుల్లో ఉండ‌డం వ‌ల్ల‌... స‌రైనోడు మాటే చెల్లు బాటు అయ్యే ప‌రిస్థితికి వ‌చ్చింది. నిజానికి స‌రైనోడుకి అక్క‌డ కూడా వ‌సూళ్లు లేవు. ఏదో రికార్డు కోసం బ‌ల‌వంతంగా ఆడించ‌డం త‌ప్ప‌... పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేదు. అయినా స‌రే.. బ‌న్నీ త‌న మాటే చెల్లుబాటు అవ్వాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ కూడా బ‌న్నీపై గుర్రుగా ఉన్నారు. 'బ‌ల‌వంతంగా ఎన్ని రోజులు ఆడిస్తారు' అంటూ ఫేస్ బుక్‌ల‌లో, ట్విట్ట‌ర్ల‌లో విరుచుకుప‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో అనుకొన్న సంఖ్య‌లో థియేట‌ర్లు రాక‌పోతే..ఆ ప్ర‌బావం బ్ర‌హ్మోత్స‌వం వ‌సూళ్ల‌పై ప‌డే అవ‌కాశం ఉంది.