English | Telugu

నాగార్జున పై బాలయ్య కోపం ఇంకా త‌గ్గ‌లేదా?

నందమూరి బాల‌కృష్ణ వందో చిత్రం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. తెలుగునాట అతిర‌థ మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. బాల‌కృష్ణ‌తో పాటు అగ్ర క‌థానాయ‌కులుగా వెలిగిన‌.. చిరంజీవి, వెంక‌టేష్‌లు కూడా హాజ‌ర‌య్యారు. ఈ బ్యాచ్‌లో నాగార్జున మాత్ర‌మే మిస్సింగ్. నాగార్జున కూడా వ‌చ్చుంటే.. ఈ న‌లుగురు హీరోల క‌ల‌యిక‌... గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి ప్రారంభ‌వోత్స‌వంలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేది. అయితే.. నాగార్జున రాలేదు. నిజానికి ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న‌కు ఆహ్వాన ప‌త్రం అంద‌లేన‌ది టాక్‌. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగిన అతి పెద్ద ఈవెంట్‌కి నాగార్జున మిస్ అవ్వ‌డానికి కార‌ణం.. అదే అని తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా బాల‌య్య‌, నాగ్‌ల మ‌ధ్య దూరం పెరుగుతూనే ఉంది.

ఓ అవార్డు ఫంక్ష‌న్ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి తార‌క రామారావు ఫెక్ల్సీ ఏర్పాటు చేయ‌లేద‌ని.. బాల‌య్య అలిగార‌ట‌. నాగ్ ఫోన్ చేసి ఏదో స‌ర్దిచెప్ప‌బోయినా బాల‌య్య వినిపించుకోలేద‌ని తెలుస్తోంది. అప్ప‌టి నుంచీ. నాగ్‌, బాల‌య్య మ‌ధ్య గ్యాప్ మొద‌లైంద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల గుస‌గుస‌. అందుకే ఈ కార్య‌క్ర‌మానికీ బాల‌య్య‌.. నాగ్‌ని దూరం పెట్టార‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు అగ్ర హీరోల మ‌ధ్య ఈ లేనిపోని ఈగో ప్రాబ్ల‌మ్స్ ఎందుకో మ‌రి.. వీటికి ఎప్పుడు పుల్ స్టాప్ ప‌డుతుందో కాల‌మే చెప్పాలి.