English | Telugu

శంకర్‌ హాలీవుడ్‌ ప్లాన్

హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ సౌత్‌ ఇండియన్‌ ఫిలింలో విలన్‌ రోల్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఊహకందని విషయం. కానీ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ విషయాన్ని నిజం చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. రోబో-2. ‘ఐ’ తర్వాత ఏం సినిమా చేద్దామా అని రకరకాలుగా ఆలోచించి చివరికి రోబో-2కే ఓటేశాడు శంకర్‌.

ప్రస్తుతం స్క్రిప్టు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అదే సమయంలో కాస్టింగ్‌ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే రోబో-2 విలన్‌ అంటూ అమీర్‌ఖాన్‌, కమల్‌ హాసన్‌, విక్రమ్‌.. ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఐతే ఆ పేర్లన్నింటినీ పక్కన పెట్టేసి ఆర్నాల్డ్‌తో విలన్‌ వేషం చేయించే విషయాన్ని పరిశీలిస్తున్నాడట శంకర్‌. ఆర్నాల్డ్‌తో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

నిజంగా ఆర్నాల్డ్‌ను రోబో-2లో నటింపజేస్తే మాత్రం ఈ సినిమా ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ రేంజికి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. ఐతే ఆర్నాల్డ్‌కు ఎంత పారితోషకం ఇస్తారన్నదే ఆసక్తికరం.