English | Telugu

అనుష్క బాగా ఇరిటేట్ చేసింది

రాజ‌మౌళి అంటే ప‌నిరాక్ష‌సుడు అని చెప్తుంటారంతా. సెట్లో అత‌ని ప్రొఫెష‌న‌లిజం చూస్తే ముచ్చ‌టేస్తుంద‌ట‌. అయితే సెట్లో ఎవ‌రైనా క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌క‌పోతే మాత్రం రాజ‌మౌళి భ‌రించ‌లేడ‌ట‌. ఆఖ‌రికి బాహుబ‌లి సెట్లో అనుష్కని కూడా రాజ‌మౌళి చివాట్లు పెట్టాడ‌ట‌. బాహుబ‌లి సెట్లోనే ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అనుష్క‌నే చెప్పింది. బాహుబ‌లిలో యుద్దానికి సంబంధించిన సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు అనుష్క తెగ న‌వ్వేసేద‌ట‌. కేవ‌లం అనుష్క కార‌ణంగానే... ఆయా సన్నివేశాల్ని మ‌ళ్లీ రీటేక్ చేయాల్సివ‌చ్చేద‌ట‌. ఓసారి ప‌ది, ప‌దిహేను టేకులు తీసుకొంద‌ట అనుష్క‌. ప్ర‌తిసారీ అనుష్క న‌వ్వ‌డం వ‌ల్లే... ఆ సీన్‌ని మ‌ళ్లీ తీయాల్సివ‌చ్చేద‌ట‌. చివ‌రికి స‌హ‌నం చచ్చిపోయిన రాజ‌మౌళి.. 'నువ్వు న‌వ్వ‌డం ఆపేస్తే సీన్లు తీస్తా.. లేదంటే సినిమానే ఆపేస్తా..' అని సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చార‌ట‌. దాంతో న‌వ్వు కంట్రోల్ చేసుకొని... ఆ సీన్స్‌ని సీరియ‌స్‌గానే తీసుకొని యాక్ట్ చేసింద‌ట‌. అంతా అయిపోయాక‌.. 'గుడ్‌' అని రాజ‌మౌళి ప్ర‌సంశించార‌ట‌. సెట్లో.. రాజ‌మౌళి తీరు అలా ఉంటుంది మ‌రి.