English | Telugu

ఆహుతి ప్రసాద్ కు స్కిన్ క్యాన్సరా?

ప్రముఖ నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా? ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గోప్యంగా వుంచుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ‘ఆహుతి’ ప్రసాద్ గత కొన్ని నెలలుగా స్కిన్ క్యాన్సర్ బాధపడుతున్నారట. ఆ మధ్య అమెరికా వెళ్ళి దీనికి వైద్యం కూడా చేయించుకొని వచ్చారట. కానీ మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టడంతో సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కుటుంబం మాత్రం ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సినీ పరిశ్రమ వర్గాలు మాత్రం బాధపడుతున్నాయి. ఆహుతి ప్ర‌సాద్ త్వ‌ర‌గా కోలుకోవాలని, మళ్లీ తెర‌పై క‌నిపించి సంద‌డి చేయాల‌ని ఆశిస్తున్నారు.