English | Telugu

పూరీ రూట్ లో త్రివిక్రమ్

నితిన్ సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నవిషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాను నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో వున్నాడట. సెప్టెంబర్ చివర్లో మొదలుపెట్టి, సంక్రాంతికి రిలీజ్ చేయడమంటే... గట్టిగా 4 నెలలు కూడా టైం ఉండదు. ఇంత తక్కువ సమయంలో త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేస్తాడా? నిజానికి మనోడు ఖలేజా సినిమా మేకింగ్‌కు ఎక్కువ టైమ్‌ తీసుకోవడం వలనే ఒక విధంగా లాసొచ్చిందని టాక్‌. ఆ తరువాత జులాయ్‌, అత్తారింటికి దారేది సినిమాలకు కూడా ఓ 8 నెలల టైమ్‌ పట్టేసింది. అలాగే మొన్న వచ్చిన సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా ఒక్కటే 6 నెలల్లో పూర్తయ్యిందని అనుకోవాలి. మరి ఇప్పుడు 4 నెలల్లో మనోడు కంప్లీట్‌ చేయగలడా? చూద్దాం.