English | Telugu

త‌మ‌న్నా ద‌గ్గ‌ర బేరాల్లేవ్‌...

త‌మ‌న్నా ప‌నైపోయింది అన్నవాళ్లెవ‌రు..?? అటు సినిమాలైనా స‌రే - ఇటు యాడ్స్ అయినా స‌రే - ఇప్ప‌టికీ గంట‌కు ల‌క్ష‌లు సంపాదించే క్యాపిబులిటీ, కెపాసిటీ త‌మ‌న్నా సొంతం! ఆమె స్టార్ డ‌మ్ త‌గ్గ‌లేదు స‌రికదా... ఇంకాస్త పెరిగింది. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. జీ టీవీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారింది త‌మ‌న్నా. ఈ టీవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మూడు రోజులు కాల్షీట్లు కేటాయించింది త‌మ‌న్నా. అందుకోసం 63 ల‌క్ష‌లు పారితోషికం అందుకొంద‌ట‌. అంటే రోజుకి 21 ల‌క్ష‌లు. ప్ర‌తీ రోజూ కేవ‌లం 5 గంట‌లు మాత్ర‌మే షూటింగ్ లో పాల్గొంద‌ట‌. అంటే గంట‌కు రూ.4 ల‌క్ష‌లపైమాటే. పైగా రోజుకి 21ల‌క్ష‌లు ఇవ్వాల‌ని త‌మ‌న్నా ముందే అడిగింద‌ట‌. ఇందులో బేరాల‌కు తావులేద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేసింద‌ట‌. త‌మ‌న్నా అడిగిన రేటుకే.. ఆమె కాల్షీట్లు కొనుక్కొంది జీ టీవీ బృందం. అన్న‌ట్టు 'మ‌రో రోజు అడిష‌న‌ల్ గా నీ కాల్షీట్లు కావాలి' అని అడిగితే.. ఈసారి 'రూ.30 ల‌క్ష‌లు కావాలి..' అని డిమాండ్ చేస్తోంద‌ట‌. వామ్మో... దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం అంటే ఇదేనేమో.??