English | Telugu

సమంత డబుల్ ట్రీట్

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు డబుల్ రోల్లో నటించడం చాలా తక్కువనే చెప్పాలి. అయితే లేటెస్ట్ గా ఓ టాప్ హీరోయిన్ ద్విపాత్రాభినయం చేసి మనకు సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది. ఇంతకీ ఎవరా.. ఆ బ్యూటీ అనేగా మీ ఆతృత. ఆమె ఎవరో కాదు మన అందాల సమంతా. విక్రమ్‌తో ‘10 ఎన్‌రాదుకల్ల’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో సమంత డబుల్ రోల్‌లో నటిస్తోందట.. ప్రస్తుతం నేపాల్‌లో ఈ రెండు డిఫరెంట్ లుక్స్‌లో షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ.. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ రోల్స్‌ చేయనుండటం నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఒకటి నేపాలి యువతి పాత్ర అయితే, రెండోది గ్లామరస్‌గా ఉంటుంది. రెండో పాత్రలు ఇప్పటి వరకే చేసినా.. మొదటి పాత్ర మాత్రం చాలా ఛాలెంజింగ్‌తో కూడుకున్నది. దీని కోసం నా బాడీ లాంగ్వేజ్‌, హెయిర్‌స్టైల్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ అంటూ నన్ను నేను కొత్తగా చూపించుకోవాల్సి వస్తుంది. ఈ పాత్రను బాగా చేసేందుకు చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.