English | Telugu
రామ్‌చరణ్ Vs అల్లు అర్జున్
Updated : Oct 19, 2015
మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు పడడం లేదా? ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందా? ఒకరినొకరు మాటా మాటా అనుకొన్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌కీ, బన్నీకీ మధ్య దూరం పెరిగిందని.. టాక్. వరుసకు బావలైనా, స్నేహితుల్లా ఉండే వీరిద్దరూ - ఈ మధ్య దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దానికి కారణం రుద్రమదేవి అని సమాచారం.
రుద్రమదేవి విషయంలో దాసరి నారాయణరావు ప్రెస్ మీట్ పెట్టి `బ్రూస్లీని వాయిదా వేయాలి` అని సూచించడం చరణ్‌కి రుచించలేదట. దాంతో బ్రూస్లీ సినిమాపై, చరణ్‌పై నెగిటీవ్ టాక్ మొదలయ్యే ప్రమాదం ఉందన్నది చరణ్ భయం. దాసరి ప్రెస్ మీట్ పెట్టడం వెనుక బన్నీ హస్తం లేకపోయినప్పటికీ.. `గుణశేఖర్‌కి చెప్పి.. ఆపాలి కదా` అని చరణ్ బన్నీని నిలదీశాడట.
బన్నీ చెబితే.. గుణశేఖర్ కూడా మాట వింటాడు. అలాంటప్పుడు ఈ పంచాయితీ దాసరి వరకూ వెళ్లేది కాదన్నది చరణ్ అభిప్రాయం. అందుకే దాసరి ప్రెస్ మీట్ అవ్వగానే బన్నీ ఓ ప్రెస్ నోట్ విడుల చేశాడు. `విడుదల తేదీ విషయంలో బ్రూస్లీది తప్పు లేద`ని వెనకేసుకొచ్చాడు. మొత్తమ్మీద... రుద్రమదేవివల్ల బన్నీ, చెర్రీల మధ్య ఓ గ్యాప్ అంటూ వచ్చింది. ఇది దూరం ఎప్పటికి దగ్గరవుతుందో??