English | Telugu
చిరు ఓకే అంటేనే.. చోటా మేస్త్రీ
Updated : Dec 14, 2015
బ్రూస్లీ ప్లాప్ అవ్వడంతో... రామ్ చరణ్ కెరీర్ అయోమయ పరిస్థితిల్లో పడిపోయింది. పక్కా మాస్ సినిమాలు చేయాలా, లేదంటే క్లాస్ టచ్ ఉండేలా చూసుకోవాలా అనే సందిగ్థంలో ఉన్నాడు చరణ్. ఈ దశలో.. చిరంజీవి చరణ్‌కు దిశానిర్దేశం చేయబోతున్నాడట. చరణ్‌కి సరితూగే కథల్ని విని ఓకే చేసే బాధ్యత చిరు తీసుకొన్నాడిప్పుడు. ఇది వరకు... చరణ్‌కి కథ నచ్చితే, ఫైనల్ డిసీజన్ కోసంచిరుకి వినిపించేవారు.
అది ఇప్పుడు రివర్స్ అయ్యింది. ముందు చిరు విని, నచ్చితే అప్పుడు చరణ్ దగ్గరకు పంపుతున్నాడట. అందులో భాగంగానే చోటా మేస్త్రీ కథ ముందు చిరు విన్నాడని టాక్. బెంగాల్ టైగర్ తరవాత రామ్‌చరణ్ తో ఓ సినిమా చేయాలని సంపత్‌నంది భావిస్తున్నాడు. అందుకోసం చోటా మేస్త్రీ అనే స్ర్కిప్టు రెడీ చేశాడు.
అయితే చరణ్ కంటే ముందు ఈ కథని చిరుకి వినిపించాల్సివచ్చిందట. చిరు కథంతా విని 'తరవాత చెప్తా' అని సంతప్ని పంపేసినట్టు తెలుస్తోంది. చిరు ఓకే అంటే.. చోటా మేస్త్రీ ప్రాజెక్టు ఉంటుంది, లేదంటే లేదు. అందుకే.. సంపత్ ఇప్పుడు చిరువైపు ఆశగా చూస్తున్నాడు.