English | Telugu

పూరిపై చ‌ర‌ణ్ ఫైర్‌?

చిరంజీవి 150వ సినిమాకి నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ పూరి జ‌గ‌న్నాథే ద‌ర్శ‌కుడని అంతా అనుకొన్నారు. ఆగ‌స్టు 22న ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని ఆశ ప‌డ్డారు. మెగా అభిమానుల ఆశ‌ల‌పై పూరి నీళ్లు జ‌ల్లాడు. ఫ‌స్టాఫ్ అద్భుతంగా రాసుకొచ్చిన పూరి... సెకండాఫ్ తేల్చేయ‌డంతో ఈ సినిమా పూరి చేతుల్లోంచి జారిపోతోందిప్పుడు. ఆటోజానీ ని టేక‌ప్ చేసే అవ‌కాశం పూరికి దాదాపుగా లేన‌ట్టే అని మెగా కాంపౌండ్ వ‌ర్గాలే చెబుతున్నాయి.

ఈ విష‌యంలో అంద‌రికంటే ఎక్కువ‌గా నిరాశ‌కు లోనైంది మాత్రం రామ్‌చ‌ర‌ణ్‌. ఎందుకంటే డాడీ 150వ సినిమాకి పూరీనే స‌రైన ద‌ర్శ‌కుడు అని న‌మ్మాడు రామ్‌చ‌ర‌ణ్‌. అంతేకాదు... నెల‌ల త‌ర‌బ‌డి ఈ స్టోరీ కోసం పూరితో ట్రావెల్ అయ్యాడు. కేవ‌లం ఈ సినిమా కోసమే శ్రీ‌నువైట్ల‌తో సినిమాని కూడా కొంత‌కాలం వాయిదా వేసుకొంటూ వ‌చ్చాడు. సెకండాఫ్ ని బాగా రాసుకుర‌మ్మ‌ని పూరిపై బాగా ఒత్తిడి తీసుకొచ్చాడు చ‌ర‌ణ్‌. అయితే పూరి మాత్రం.. ఆ విష‌యంలో స‌క్సెస్ కాలేక‌పోయాడు. దాంతో పూరిపై చ‌ర‌ణ్ ఫైర్ అయిన‌ట్టు తెలుస్తోంది. `మీ మీద ఆశ‌లు పెట్టుకొంంటే... ఇలా చేస్తారా` అంటూ కాస్త గ‌ట్టిగానే అడిగాడ‌ట‌.

150వ సినిమా వ‌దిలేసి.. మిగిలిన సినిమాల‌పై దృష్టి పెట్ట‌డం కూడా చ‌ర‌ణ్‌కి న‌చ్చ‌లేదు. ఈ గ్యాప్ లో మ‌రో సినిమా చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?? ఈలోగా క‌థ పూర్తి స్థాయిలో రెడీ చేసుకోవ‌చ్చు క‌దా.. అని కూడా చెప్పాడ‌ట‌. కానీ చ‌ర‌ణ్ మాట‌ల్ని పూరి బేఖాత‌రు చేయ‌డంతో.. చ‌ర‌ణ్‌కూడా బాగా హ‌ర్ట‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు చ‌ర‌ణ్‌కి మ‌ళ్లీ ప‌డిప‌డింది. వినాయ‌క్‌తో క‌ల‌సి.. 150వ సినిమాకి మ‌ళ్లీ డిస్క‌ర్షన్స్ మొద‌లెట్టాడ‌ని టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.