English | Telugu

బాలకృష్ణ డిక్టేట‌ర్ పై ప్రణీత క్లారిటీ

బాలకృష్ణ డిక్టేట‌ర్ సినిమా నుంచి ప్రణీత తప్పుకోవడంతో అందరూ ఆమెని విమర్శించారు. బాలయ్య సినిమా నుంచి తప్పుకొని మంచి అవకాశం పోగొట్టుకుందని అందరూ అన్నారు. అయితే ఈ విష‌యంపై ప్ర‌ణీత క్లారిటీ ఇచ్చింది. ''డిక్టేట‌ర్ వ‌దులుకోవ‌డం ఇప్పటికీ బాధ‌గానే ఉంది. బాల‌కృష్ణ లాంటి అగ్ర క‌థానాయ‌కుడి సినిమాలో అవ‌కాశం రావ‌డం నిజంగా అదృష్టం. కాక‌పోతే... నా కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక ఈ సినిమాని వ‌దులుకొన్నాత‌ప్ప‌.. మ‌రో ఉద్దేశం లేదు. నా పాత్ర బాగుంటే చాలు.. రెండో క‌థానాయిక‌గా అయినా న‌టించ‌డానికి రెడీ. నాకు పేరు తెచ్చిన‌వి కూడా అలాంటి సినిమాలే క‌దా. అలాంట‌ప్పుడు ఈ ఛాన్స్ ఎందుకు వ‌దులుకొంటా..'' అని చెప్పుకొచ్చింది ప్ర‌ణీత‌.