English | Telugu
బాధలో 'బాహుబలి'
Updated : Jul 11, 2015
పేరు నాది క్రెడిట్ మరొకరిది అని ప్రబాస్ ఫీలవుతున్నాడట. మంచి మంచి ప్రాజెక్టులన్నీ పక్కనపెట్టి బాహుబలి కోసం చమటోడ్చి కష్టపడితే పూర్తి స్థాయి క్రెడిట్ తనకు రాలేదే అనేబాధలో ఉన్నాడట. శివగామిగా రమ్యకృష్ణ దుమ్ముదులిపిందని.....విలన్ గా రానా ఇరగదీశాడంటున్నారు.
మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ప్రభాస్ గురించి అంతో ఇంతో మాట్లాడుతున్నారు తప్ప.....విమర్శకుల ప్రశంసల్లో ప్రభాస్ కి పెద్దగా చోటు దక్కలేదు. తండ్రి, కొడుకు పాత్రల్లో వేరియేషన్ తప్పిస్తే....కష్టపడి బిల్డప్ చేసుకున్న ప్రబాస్ బాడీని బాగా ఎలివేట్ చేయలేదనే కామెంట్స్ ప్రభాస్ వరకూ చేరాయి. పైగా ఫైట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని....బాడీ ఫీట్లు లేవు అని....కత్తులు, ఈటెలపై పెట్టిన శ్రద్ధ ప్రభాస్ పై పెట్టలేదని అభిమానులు నిరాశచెందుతున్నారు.
ఇవన్నీ విన్న ప్రభాస్ కష్టమంతా వృధా అయిపోయిందే అని మథనపడుతున్నాడట. సెకెండ్ పార్ట్ కి ఇంకో ఏడాది అనడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నాడట.