English | Telugu
పెళ్లిచూపులు డైరెక్టర్ వెనుక పరిగెడుతున్నారు!
Updated : Jul 30, 2016
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వెనుక పరుగు అనేది కొన్ని దశాబ్ధాలుగా జరుగుతున్నదే. సో, "పెళ్ళిచూపులు" చిత్రంతో సూపర్ హిట్ అందుకొన్న తరుణ్ భాస్కర్ వెనుక దర్శకనిర్మాతలు, హీరోలు "మాకో సినిమా చేసిపెట్టమంటూ" తిరగడం అన్నది సర్వసాధారణం. అయితే.. మనోడు ఇచ్చింది మామూలు హిట్ కాదు కదా. రిలీజ్ ముందే సినిమాకి పెట్టిన బడ్జెట్ కి రెండితలు రాగా.. ఇప్పుడు కలెక్షన్ రూపంలో ఆ పెట్టుబడీకి అయిదింతలు ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది.
దాంతో.. తరుణ్ భాస్కర్ కి ఓ బంపర్ ఆఫర్ లభించిందని ఇండస్ట్రీ టాక్. "పెళ్ళిచూపులు" చిత్రాన్ని ఆఖరి నిమిషంలో ప్రమోట్ చేసి.. సినిమా సక్సెస్ అవ్వడానికి కీలకపాత్ర పోషించిన సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను కథానాయకుడిగా పరిచయం చేసే పనిని తరుణ్ కు అప్పగించడంతోపాటు తమ్ముడు విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథను కూడా రాయమని చెప్పాడట. అన్నీ కుదిరితే అభిరామ్ సినిమా అయిపోయాక.. డైరెక్ట్ గా వెంకీని డైరెక్ట్ చేసే సదవకాశం తరుణ్ భాస్కర్ దాస్యం సొంతం అవుతుంది. ఏదేమైనా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్పా!