English | Telugu

కోన 'భ‌జ‌న‌'కు ప‌వ‌న్ ప‌డిపోయాడా?

ఈ మ‌ధ్య కోన వెంట‌క్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ భ‌జ‌న కాస్త ఎక్కువే చేస్తున్నాడు. శంక‌రాభ‌ర‌ణం ప్ర‌మోష‌న్ల‌కు ప‌వ‌న్ ని దేవుడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఈ మాట‌ల‌కు, కోన చేష్ట‌ల‌కు ప‌వ‌న్ కూడా ప‌డిపోయిన‌ట్టున్నాడు. అందుకే కోన‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేసిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. అవును.. కోన ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చే యేడాది ఓ సినిమా ఉండ‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కోన కూడా అందుకు హింట్ ఇచ్చేస్తున్నాడు.

ప‌వ‌న్ కోసం ఓ క‌థ రెడీ చేశాడ‌ని, దానికి ప‌వ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా వ‌చ్చేసిన‌ట్టు బ‌య‌ట చెప్పుకొంటున్నాడ‌ట‌. కోన‌కు ఎప్ప‌టి నుంచో మెగా ఫోన్ పై గురి. త‌మిళంలో ఓ సినిమా తీశాడు గానీ వర్కువ‌ట్ కాలేదు. ఓ పెద్ద హీరో కోసం క‌థ రెడీ చేసుకొని, ద‌ర్శ‌కుడిగా పునః ప్ర‌వేశం చేయాల‌ని కోన స్కెచ్‌. గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం సినిమాల్ని ఇండైరెక్టుగా డైరెక్ట్ చేసి... త‌న ప్ర‌తిభ‌ను సాన‌బెట్టుకొన్నాడ‌ట‌. ఇక ప‌వ‌న్ సినిమాతో రంగంలోకి దిగ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి కోన ప‌వ‌న్ కోసం ఎలాంటి క‌థ సిద్ధం చేశాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.