English | Telugu

'షేర్' లో మేట‌రేం లేదా?

క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు బాడీ లాంగ్వేజీని బట్టి.. రాబోతున్న సినిమా ఫ‌లిత‌మేంట‌న్న‌ది క్లియ‌ర్‌గా అర్థ‌మైపోతుంటుంది. కూల్‌గా కామ్ గా ఉంటే... అనుకొన్న సినిమా అనుకొన్న‌ట్టుగా వ‌చ్చిన‌ట్టే. అదే... ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటే ఆ సినిమాలో ఏదో తేడా వ‌చ్చిన‌ట్టే. ఇప్పుడు క‌ల్యాణ్ రామ్‌నిచూస్తుంటే `షేర్‌` సినిమాపై లేని పోని డౌట్లు వ‌స్తున్నాయి.

బుధ‌వారం మీడియాకు క‌ల్యాణ్ రామ్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. పాత్రికేయులు అడిగిన ప్రశ్న‌ల‌కు క‌ల్యాణ్ రామ్ చెప్పిన స‌మాధానాలు, ఆ బాడీ లాంగ్వేజీ చూస్తుంటే ఈ సినిమాపై ముందే డౌట్లు మొద‌లైపోయాయి. సినిమా గురించి, సాంకేతిక నిపుణుల గురించి ఏం అడిగానా ''నేనేం చెబుతానండీ.. ఏం చెప్పినా మీకు సిల్లిగా అనిపిస్తుంది'' అంటూ స‌మాధానం ఇచ్చేవాడు క‌ల్యాణ్ రామ్‌.

ఈ సినిమా ఎన్టీఆర్ కూడా చూశాడ‌ని కానీ త‌నేం చెప్పాడో మాత్రం చెప్ప‌నని, అది త‌మ ఇద్ద‌రి మ‌ధ్యే ఉంటుంద‌ని క‌ల్యాణ్ రామ్ చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంటే ఈ సినిమాలో మేట‌రేం లేదా?? అనే అనుమానాలు వ‌చ్చేట్టు చేసింది. పైగా ప్ర‌తిసారీ ''నాకుహిట్టు రాక‌పోయినా ఫ‌ర్వాలేదు. మా ద‌ర్శ‌కుడు మ‌ల్లి మాత్రం హిట్ కొట్టాలి. అత‌ని కోసం ఈసినిమా ఆడాలి'' అంటున్నాడు క‌ల్యాణ్ రామ్‌.

ఓ సినిమా హిట్ట‌యితే పేరొచ్చేది ముందు హీరోకి. ఆ త‌ర‌వాతే ఎవ‌రైనా. ఈ చిన్న లాజిక్ క‌ల్యాణ్ రామ్ ఎలా మ‌ర్చిపోయాడు. మొత్త‌మ్మీద క‌ల్యాణ్ రామ్ ఇచ్చిన స‌మాధానాలు, అత‌ని ఓవ‌రాక్ష‌న్ చూస్తుంటే.. షేర్ లో ఏం లేన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంకెంత మ‌రో 24 గంట‌లు ఆగితే రిజ‌ల్ట్ తెలిసిపోతుంది క‌దా. వెయిట్ అండ్ సీ.