English | Telugu

అలీ... ఖ‌బ‌ద్డార్‌....

ఆడియో ఫంక్ష‌న్లో అలీ ఉన్నాడంటే.. జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు. మైకు అందుకొంటే.. ఎలాంటి మాట‌లు వినాల్సివ‌స్తుందో అని వ‌ణికిపోతున్నారు. ఒక‌ట్రెండు వేడుక‌ల్లో అలీ మాట‌లు చూసి.. వీడియోల రూపంలో అలీని ఏకి ప‌డేశారు కొంత‌మంది అమ్మాయిలు. సుమ‌, స‌మంత‌లు కూడా అలీకి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయినా అలీ మార‌లేదు. లేటెస్టుగా సైజ్ జీరో ఆడియో ఫంక్ష‌న్లోనూ ఇలానే రెచ్చిపోయి తొడ‌ల గురించి ఉప‌న్యాసం ఇచ్చాడు. అనుష్క తొడ‌లు సూప‌ర్ అన్నాడు. దాంతో ఇప్పుడు మళ్లీ అలీపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

హైదరాబాద్ కు చెందిన ఆశ అనే యువతి అలీపై నిప్పులు చెరిగింది. ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేస్త్తూ.. అవమానపరిస్తే మహిళ సంఘాలతో క‌ల‌సి అలీ అంతు చూస్తామంటూ ఓ వీడియో చేసి నెట్ లో పెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.

అలీ పోగ్రాం వ‌స్తుందంటే చాలు, ఇంట్లో డే పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, తాను ఇప్ప‌టికైనా బుద్ది తెచ్చుకోవాల‌ని లేదంటే.. మహిళ సంఘాలతో క‌ల‌సి అలీ అంతు చూస్తామని ఆ యువతి హెచ్చరించింది. ఇటీవల అలీని తిడుతూ అన్నపూర్ణ సుంకర పోస్ట్ చేసిన వీడియోకి నెటింజ‌న్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి... ఈ ఆశ‌.. వీడియో ఇంకెంత దూసుకెళ్తుందో, దీనిపై అలీ ఇచ్చే కౌంట‌రేంటో చూడాలి.