English | Telugu

స్టోరీ మారింది చిరూ..

చిరంజీవి రీ ఎంట్రీ అంటే మామూలు విష‌య‌మా?? చిరు క‌నిపించ‌గానే విజిల్స్ ప‌డాలి. స్టెప్పులేస్తే.. గోల గోల చేయాలి. ఫైటింగులకు థియేట‌ర్ ద‌ద్ద‌ల్లాలి. రాక రాక వ‌స్తున్నాడు చిరు. రీ ఎంట్రీ గ్రాండాతి గ్రాండ్‌గా ఉండాలి క‌దా. ప్ర‌స్తుతం శ్రీ‌నువైట్ల అండ్ టీమ్ అదే పనిలో ఉంది. రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న బ్రూస్లీ - ది ఫైట‌ర్‌లో చిరంజీవి ఓ అతిథి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసింది. ముందు అనుకొన్న ప్ర‌కారం చిరు క‌నిపించాల్సింది జ‌స్ట్ రెండు నిమిషాలే. అయితే.. ఇది ఇప్పుడు మారింది. అస‌లుచిరురాక రాక వ‌స్తున్నాడు.. ఇలా వ‌చ్చి, అలా మాయ‌మైపోతే - ఫ్యాన్స్ ఫీల‌వుతారు. చిరు రెండు నిమిషాల పాత్ర వ‌ల్ల సినిమాకి అద‌నంగా ఒరిగేదీ ఏం ఉండ‌దు. అందుకే రెండు నిమిషాల పాత్ర‌ని పాత్ర పొడిగిస్తూ వెళ్తున్నారు.

చిరు కోసం ఓ పాట పెట్టారు. ఆ త‌ర‌వాత ఓ ఫైటూ యాడ్ చేశారు. దాంతో క‌థ‌ని కెల‌కాల్సివ‌చ్చింది. చిరు కోసం కోన వెంక‌ట్‌, గోపీమోహ‌న్‌లు క‌ల‌సి... ఏకంగా స్టోరీనే మార్చేశార‌ట‌. సెకండాఫ్‌లో ఓ భారీ ట్విస్ట్ యాడ్ చేసి, అక్క‌డ చిరు చేత ఎంట్రీ ఇప్పించారు. ప్రీ క్లైమాక్స్ లోనూ క‌థ మార్చార‌ట‌. ఓ సీన్‌లో చ‌ర‌ణ్ ఫైట్ చేస్తాడ‌నుకొంటే.. చిరు రంగంలోకి దిగి రౌడీల‌ను చిత‌గ్గొట్టేస్తాడ‌ట‌. ఈ సీన్ పండడం కోసం క‌థ‌ని మరికాస్త మార్చాల్సివ‌చ్చింద‌ని టాక్‌. మొత్తానికి చిరు కోసం కథ‌ని ఎలాక్కావాలంటే అలా... ఎంత‌కావాలంటే అంత మార్చేసుకొన్నారు. మ‌రి ఈ ఎఫెక్ట్ ప్ల‌స్సో. లేదంటే.. చిరు కోసం చేసిన భారీ మార్పుల కార‌ణంగా ఈ కథ‌కి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయో తేలాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాలి.