English | Telugu

మోహన్ లాల్ తో పోటీపడుతున్న అల్లు హీరో!

"ది కంప్లీట్ యాక్టర్" అని పిలవబడే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈమధ్యకాలంలో తెలుగులోనూ వరుస సినిమాలతో జోరుమీడున్నాడు. ఆయన నటించిన "మనమంతా, జనతా గ్యారేజ్" సినిమాలు విడుదల సన్నాహాల్లో ఉన్నాయి. అయితే.. మలయాళంలో మోహన్ లాల్ సూపర్ స్టారే కావచ్చు కానీ.. తెలుగులో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టే. అందుకే ఆయన ముఖ్యపాత్రలో నటించిన "మనమంతా" సినిమాకి పోటీగా అల్లు శిరీష్ తన మూడో చిత్రం "శ్రీరస్తు శుభమస్తు"ను విడుదల చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ ఒకే తేదీన అనగా.. ఆగస్ట్ 5న విడుదలకు సన్నద్ధమవుతున్నాయి.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో "మనమంతా" చిత్రాన్ని వారాహి సంస్థ నిర్మించగా.. గీతా ఆర్ట్స్ సంస్థ "శ్రీరస్తు శుభమస్తు"ను పరశురామ్ దర్శకత్వంలో నిర్మించింది. ఈ రెండూ వేటికవే విభిన్నమైన చిత్రాలైనప్పటికీ.. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో సినిమాతో అల్లు శిరీష్ లాంటి ఇంకా నిలదొక్కుకోవడానికి పాట్లు పడుతున్న యువ కథానాయకుడు పోటీకి దిగుతుండడం అందర్నీ ఆకర్షిస్తుంది. మరి ఈ రెండు ఏది విజయం సాధిస్తుంది. ఎవరిమీద ఎవరిది పైచేయిగా నిలుస్తుంది అనేది తెలియాలంటే ఆగస్ట్ 5 వరకూ ఆగాల్సిందే!