Read more!

English | Telugu

'మ‌రోచ‌రిత్ర' హీరోయిన్ స‌రిత డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అయ్యారు?

 

లెజెండరీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్ ప‌రిచ‌యం చేసిన ఎంతోమంది ఆర్టిస్టుల్లో స‌రిత ఒక‌రు. ఆయ‌న రూపొందించిన క్లాసిక్ ల‌వ్ స్టోరీ 'మ‌రోచ‌రిత్ర‌'లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా ఎంట్రీ ఇచ్చిన స‌రిత‌, ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లోనే ఏకంగా 23 సినిమాల్లో ఆమె న‌టించ‌డం గొప్ప విష‌యం. హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లోనే ఆమె డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా మార‌డం మ‌రో విశేషం. ఆమెను అలా మార్చింది మ‌రో లెజండ‌రీ డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు.

ఆమె మొట్ట‌మొద‌ట‌గా మ‌రో తార‌కు డ‌బ్బింగ్ చెప్పిన సినిమా.. దాస‌రి రూపొందించిన 'గోరింటాకు'. అందులో హీరోయిన్ సుజాత‌కు ఆమె వాయిస్ ఇచ్చారు. "నా వాయిస్ బాగుంటుంద‌ని నాకే తెలీదు. నిజానికి మ‌రోచ‌రిత్ర డ‌బ్బింగ్ టైమ్‌లో డైరెక్ట‌ర్ బాల‌చంద‌ర్ గారు న‌న్ను వ‌ద్ద‌నేశారు. డ‌బ్బింగ్ టెక్నిక్ తెలీక పోవ‌డం వ‌ల్ల మొద‌ట స‌రిగా చెప్ప‌లేక‌పోయాను. అయితే అక్క‌డి రికార్డింగ్ ఇంజ‌నీర్ నా వాయిస్ చాలా బాగుంద‌ని డైరెక్ట‌ర్‌గారిని క‌న్విన్స్ చేశారు. కొంచెం టైమ్ తీసుకున్నాక ఆ టెక్నిక్ అల‌వ‌డింది." అని చెప్పారు స‌రిత‌.

Also read: ​సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

"దాస‌రిగారు 'గోరింటాకు' సినిమాలో సుజాత‌కు డ‌బ్బింగ్ చెప్పాల్సిందిగా అడిగారు. న‌న్నెందుకు డ‌బ్బింగ్ చెప్ప‌మ‌ని అడుగుతున్నారా? అని మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను. అయితే డ‌బ్బింగ్ ప్ర‌క్రియ నాకు నిజంగా న‌చ్చింది. దాంట్లో నాకు క్రియేష‌న్ క‌నిపించింది. హీరోయిన్‌కు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయంటే నాకు పిలుపు వ‌చ్చేది. అలా 'స్వాతి'లో సుహాసినికి చెప్పాను. న‌టిగా మూడు షిఫ్టుల‌తో బిజీగా ఉన్న‌ప్పుడు కూడా రాత్రివేళ డ‌బ్బింగ్ చెప్పేదాన్ని. ఆ ఆర్ట్‌ను నేను ఇష్ట‌ప‌డ్డాను. అయితే డ‌బ్బింగ్ చెప్పొద్ద‌ని ఆ టైమ్‌లో న‌న్ను చాలామంది డిస్క‌రేజ్ చేసేవారు. యాక్ట‌ర్‌గా ఇంత బిజీగా ఉండి డ‌బ్బింగ్ ఎందుకు చెప్తున్నారు? అనేవారు." అని చెప్పుకొచ్చారు స‌రిత‌.

Also read: దీప్తి బ్రేక‌ప్ పోస్టుకు ష‌ణ్ణు రిప్లై ఇదే!

విజ‌య‌శాంతి, సుహాసిని, రాధ‌, సౌంద‌ర్య‌, న‌గ్మా, ర‌మ్య‌కృష్ణ లాంటి స్టార్ హీరోయిన్లు ఆమె గాత్రం వ‌ల్లే తెర‌పై గొప్ప‌గా రాణించారు. 'క‌ర్త‌వ్యం'లో విజ‌య‌శాంతి, 'స్వాతి'లో సుహాసిని, 'ఘ‌రానా మొగుడు'లో న‌గ్మా, 'న‌ర‌సింహా'లో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌లు అంత‌గా పండి, ప్రేక్ష‌కుల్ని అల‌రించాయంటే.. ఆ సినిమాల్లో వారికి తెర‌వెనుక స‌రిత చెప్పిన డైలాగ్స్‌కు కూడా ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.