English | Telugu

ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆ సినిమా షూటింగ్‌లో 20 మంది.. సినిమా చూస్తూ 24 మంది చనిపోయారు!

ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆ సినిమా షూటింగ్‌లో 20 మంది.. సినిమా చూస్తూ 24 మంది చనిపోయారు!

సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది రకరకాలుగా ఉంటుంది. కొన్ని నవ్వించడం ద్వారా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. కొన్ని భయపెడుతూ ఎంటర్‌టైన్‌ చేస్తాయి. సినిమాల్లో భయానక సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. 1896లో వచ్చిన ఫ్రెంచ్‌ మూవీ ‘ది హాంటెడ్‌ క్యాజిల్‌’ ప్రపంచంలోనే మొదటి హారర్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇది మూకీ చిత్రం. ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు ఈ సినిమాలో ఆరోజుల్లోనే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ని ఉపయోగించడం విశేషం. ఆ తర్వాత హాలీవుడ్‌లో ఎన్నో రకాల హారర్‌ మూవీస్‌ని నిర్మించారు. ఇండియా విషయానికి వస్తే.. 1949లో అశోక్‌కుమార్‌, మధుబాల జంటగా కమల్‌ అమ్రోహి దర్శకత్వంలో వచ్చిన ‘మహల్‌’ తొలి హారర్‌ మూవీ. 

హారర్‌ మూవీస్‌కి పరాకాష్టగా చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు హాలీవుడ్‌లో నిర్మించబడ్డాయి. వాటిలో ‘ది ఎక్సార్సిస్ట్‌’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని తర్వాత ఈ తరహా సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ఆ క్రమంలోనే ‘ది ఆమెన్‌’, ‘ది ఈవిల్‌ డెడ్‌’, ‘పోల్టర్‌గీస్ట్‌’ వంటి సినిమాలు ప్రేక్షకుల్ని భయపెట్టి సొమ్ము చేసుకున్నాయి. ఒక దశలో హారర్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడిరది. హాలీవుడ్‌ దర్శకులే కాకుండా వివిధ దేశాలకు చెందిన దర్శకులు ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు రకరకాల కాన్సెప్ట్‌లతో సినిమాలను రూపొందించేవారు. 1896లోనే తొలి హారర్‌ వచ్చినప్పటికీ 1973 నుంచే ప్రేక్షకులు ఆ తరహా సినిమాలను విపరీతంగా ఆదరించడం మొదలుపెట్టారు. వీటన్నింటిలోనూ ‘ది ఎక్సార్సిస్ట్‌’ అనే హారర్‌ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

విలియమ్‌ ఫ్రీడ్‌కిన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ది ఎక్సార్సిస్ట్‌’ చిత్రం 1973 డిసెంబర్‌ 26న విడుదలైంది. 12 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించి 442 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ‘ది ఎక్సార్సిస్ట్‌’ అనే సినిమాను ప్రపంచంలోనే ఎక్కువ శాపానికి గురైన సినిమాగా భావిస్తారు. ఎందుకంటే ఈ సినిమా వల్ల ఎంతో మంది చనిపోవడం, మరెంతో మంది అనారోగ్యం బారిన పడడం జరిగింది. ఒకరోజు రాత్రి స్టూడియోలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో సెట్‌ మొత్తం మంటలు అలుముకున్నాయి. ఆ ప్రమాదంలో యూనిట్‌లోని 20 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎలెన్‌ బర్ట్సిన్‌ తీవ్రంగా గాయపడ్డారు. అలా ఎన్నో అవాంతరాలు, ప్రమాదాల మధ్య సినిమా షూటింగ్‌ పూర్తయింది. 

నిర్మాణ సమయంలోనే మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ‘ది ఎక్సార్సిస్ట్‌’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకుల శరీరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సినిమాలోని హారర్‌ సీన్స్‌కి, సౌండ్‌ ఎఫెక్ట్స్‌కి కొంతమందికి గుండె పోటు వచ్చింది. మరికొందరు తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. గుండె పోటుతో మరణించిన వారు, అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 24కి చేరింది. హారర్‌ సినిమాల్లో 10 విభాగాలకు నామినేట్‌ అయిన తొలి హారర్‌ సినిమాగా ‘ఎక్సార్సిస్ట్‌’ చిత్రం చరిత్ర సృష్టించింది. వాటిలో స్క్రీన్‌ప్లే, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. అలాగే ఓ అరడజను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా.