English | Telugu

‘నల్లంచు తెల్ల చీర’ను వద్దన్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని హిమాలయ శిఖరాలకు చేర్చిన ఎన్నో సినిమాల్లో ఒక సినిమా దొంగమొగుడు.1987వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ అయిన దొంగమొగుడు మూవీలో మెగాస్టార్ పోషించిన డ్యూయల్ రోల్ కి ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు లేడు.నేటికీ టీవీ ల్లో దొంగమొగుడు సినిమా వస్తుందంటే తమ పనులన్నీ ఆపి టీవీ ల ముందు అతుక్కొనిపోయి మరి చూస్తారు. ఆ రోజుల్లో ఆ సినిమాలో ఆయన చేసిన మాస్ అండ్ క్లాస్ యాక్షన్ ని చూడటానికి జనం థియేటర్ల ముందు బారులు తీరేవారు. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి చేసిన డాన్స్ ,ఫైట్స్,కామెడీ ని చూసి ఎంతో మంది చిరంజీవికి వీరాభిమానులుగా మారిపోయారు.మరి అంతటి సంచలనం సృష్టించిన దొంగమొగుడు మూవీకి చిత్ర బృందం మొదట అనుకున్న టైటిల్ వేరే అని ఎంతమందికి తెలుసు.

అవి చిరంజీవి యంగ్ అండ్ డైనమిక్ హీరోగా ముందుకు దూసుకుపోతున్న రోజులు.ఒక్కో సినిమా తో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమా మీద తన ముద్ర ఉండేలా చిరంజీవి ముందుకు దూసుకుపోతున్న రోజులు.అప్పుడు రిలీజ్ అయ్యింది దొంగమొగుడు సినిమా. ఆ సినిమాలో స్టంట్ మాస్టర్ నాగరాజు అండ్ రవితేజ గా చిరంజీవి ఒక లెవెల్లో నటించాడు.అసలు డబ్బు కోసం ఏ పనైనా చేసే  స్టంట్ మాస్టర్ నాగరాజు క్యారక్టర్ లో నోట్లో బీడీ పెట్టుకొని మెడలో వయోలిన్ వేసుకొని చిరంజీవి పోషించిన క్యారక్టర్ ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. అలాగే భార్య నుంచి శత్రువుల నుంచి ఇబ్బదులు పడుతు వాళ్ళు చెప్పిందంతా చేసే రవితేజ టెక్స్ టైల్స్ కంపెనీ ఓనర్ రవితేజ క్యారెక్టర్ లో సెటిల్డ్ పెరఫార్మెన్సు ని ప్రదర్శించి అఖిలాంధ్ర ప్రజల చేత నీరాజనాలు అందుకున్నారు. స్టంట్ మాస్టర్ నాగరాజు క్యారక్టర్ లో హీరోయిన్ రాధిక తో చేసిన కామెడీ ఐతే సూపర్. అలాగే సినిమాలోని అన్ని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.చిరంజీవి చేసిన డాన్స్ కి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఊగిపోయింది. దాదాపుగా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో శతదినోత్సవాన్నికూడా  జరుపుకుంది. అలాగే వీడియో క్యాసెట్స్ రాజ్యమేలుతున్న రోజుల్లో దొంగ మొగుడు సినిమా రిలీజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది దొంగ మొగుడు మూవీ క్యాసెట్ ని తెప్పించుకొని చూసేవారు.

ఇంక అసలు విషయానికి వస్తే..కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన దొంగ మొగుడు మూవీని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నల్లంచు తెల్ల చీర అనే నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. దాంతో చిత్ర బృందం మొత్తం సినిమాకి నల్లంచు తెల్ల చీర అనే టైటిల్ నే పెట్టడానికి ఫిక్స్ అయ్యారు. కానీ చిరంజీవి మాత్రం సబ్జెక్టు చాలా మాస్ సబ్జెక్టు అని పైగా మాస్ క్యారక్టర్ అయిన స్టంట్ మాస్టర్ నాగరాజే కథ ని ఒక దారికి తీసుకొస్తాడు కాబట్టి మంచి మాస్ టైటిల్ ని పెడదాము అని అనడం తో చిత్ర బృందం అంతా చిరంజీవి నిర్ణయం తో ఏకీభవించింది. చివరికి చిరంజీవే దొంగ మొగుడు అని టైటిల్ ని పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ నల్లంచు తెల్ల చీర అనే పదం కుడా దొంగ మొగుడు సినిమా ఘన విజయం లో తన వంతు భూమిక ని పోషించింది.ఎలా అంటే నల్లంచు తెల్ల చీర అనే పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచి నేటికి చాల ఫంక్షన్స్ లో ,తిరునాళ్లలో మోత మోగిపోతూనే ఉంది.