English | Telugu
ఎన్టీఆర్ పేరుతో అల్లు రామలింగయ్య రౌడీయిజం..ఇదుగో సాక్ష్యం!
Updated : Dec 19, 2023
అల్లు రామలింగయ్య..ఈ పేరు తెలియని తెలుగు వాడు లేడు. ఎన్నో చిత్రాల్లో తనదైన బాడీ లాంగ్వేజ్ తో కామెడీ ని పండించి ఆ పాత్రలన్నీ ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా నిలిచేలా చేసిన గొప్ప నటుడు. ఆయన తెర మీద కనపడితే చాలు ప్రేక్షకుల ముఖాల్లో ఒక్క సారిగా నవ్వొస్తుంది. అలాంటి నవ్వొచ్చే ఎన్నో సినిమాల్లో బొబ్బిలి పులి సినిమా కూడా ఒకటి. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన బొబ్బిలి పులిలో అల్లు రామలింగయ్య పోషించిన కామెడీ పాత్రని చూసి నవ్వని వారు ఉండరు. ఇంతకీ ఆయన పోషించిన పాత్ర ఏంటో చూద్దాం.
సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని చూడలేక ఇండియన్ ఆర్మీ లో మేజర్ గా పని చేసిన చక్రధర్ (ఎన్ టిఆర్) బొబ్బలిపులిల మారి సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టిస్తు ఉంటాడు. ఈ క్రమంలో బొబ్బిలి పులిని పట్టుకోవాలని పోలీసులతో పాటు సంఘ విద్రోహ శక్తులు కూడా ప్రయత్నిస్తుంటారు. అప్పటికే బొబ్బిలి పులి చేసిన హత్యల గురించి ప్రజలందరికి తెలియడం వలన బొబ్బిలి పులి పేరు చెప్తేనే అందరు భయపడుతు ఉంటారు. ఈ క్రమంలో అల్లు రామలింగయ్య బొబ్బిలి పులి గెటప్ వేసుకొని రొమ్ము ముందుకు విరిచి నడుస్తు బొబ్బిలి పులి నేనే అని ప్రజల్ని బెదిరిస్తు తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అల్లు రామలింగయ్య ప్రదర్శించే బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ ప్రేక్షకులని నవ్వులతో ముంచెత్తుతాయి.
ఒకసారి బొబ్బిలి గెటప్ లో ఉన్న అల్లు రామలింగయ్యని కాషాయ వస్త్రాలు ధరించి స్వామిజీ గెటప్ లో ఉండే విలన్ సత్యనారాయణ దగ్గరకి సత్యనారాయణ మనుషులు తీసుకెళ్తారు. అప్పుడు అల్లు రామలింగయ్య చేసే కామెడీ కి కింద పడి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అక్కడ రౌడీలు అల్లు రామలింగయ్య ని కొడతారు. ఆయనకీ వాళ్ళని కొట్టే దైర్యం లేక కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళని వ్రత భంగం కలుగుతుందని నేను ఏమి అనను. రెండో సారి కొడితే మాత్రం బాగుండదు అని అంటాడు. అప్పుడు రెండో సారి కూడా కొడతారు.దాంతో రెండో సారి కూడా కొట్టారా సరే మొదటి సారి కొట్టినప్పుడు నేను మన్నిస్తాను. రెండో సారి కొడితే వేచి చూస్తాను.అని వాళ్ళని బెదిరించాలనే ఉద్దేశంతో ఇక మూడో సారి కొడితే మాత్రం రక్త పాతం అవుతుంది ఇప్పుడు కొట్టండిరా అని అంటాడు. అప్పుడు కూడా రౌడీలు కొడతారు. దాంతో వెంటనే మూడో సారి కూడా కొట్టారా మీ పాపం మీదే పొండహే అని రామలింగయ్య అంటాడు.ఇలా ఈ సినిమాలోని రామలింగయ్య సీన్స్ అన్ని కూడా ప్రేక్షకులకి విపరీతమైన నవ్వుని తెప్పిస్తాయి.
అలాగే ఒకసారి ఎన్టీఆర్ దగ్గరికి బొబ్బిలిపులి గెటప్ లో అల్లు రామలింగయ్య నడిచి వెళ్తుంటే ఆ నడక చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అలాగే ఎన్టీఆరే నిజమైన బొబ్బిలి పులి అని తెలుసుకుని మూర్ఛతో కింద పడి ఆ తర్వాత నేను బొబ్బలి పులిని కాదు బొబ్బిలి పిల్లి అని అనడం తో పాటు ఎన్టీఆర్ కోపంతో తన చేతులతో రామలింగయ్యని పైకెత్తుతుంటే అప్పుడు ఆయన పెట్టే ఎక్సప్రెషన్ కూడా విపరీతమైన నవ్వుని తెప్పిస్తుంది. విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఈ పవర్ ఫుల్ చిత్రానికి దాసరి నారాయణరావు రచనా దర్శకత్వం వహించారు. ఈ సినిమానే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించేలా చేసింది.