Read more!

English | Telugu

‘జవాన్’ తో మరింత గట్టిగా కొట్టబోతున్నాడు!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పఠాన్. జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించగా, దీపికా పడుకొనే హీరోయిన్ పాత్ర‌ను  పోషించింది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్  ఇండియన్ రా ఏజెంట్‌గా నటించారు. కథ రొటీన్ గా ఉన్న మేకింగ్ అద్భుతంగా ఉందనే స్పందన వస్తుంది. సామాన్య జ‌నం నుండి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కామన్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు 55 కోట్ల షేర్లు రాబట్టింది. రెండో రోజు ఏకంగా 60 కోట్ల షేర్‌ని రాబట్టింది. ఇలా రోజు రోజుకి పఠాన్ సందడి పెరుగుతోంది. ఈ కలెక్షన్లు వీకెండ్ లో మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సినిమా కేజిఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసింది. సరైన కథపడితే షారుక్ ఖాన్ స్పీడ్ ని ఎవరు అడ్డుకోలేరని అంటున్నారు. బాలీవుడ్‌లో ఇటీవ‌ల కేజీఎఫ్, బాహుబ‌లి వంటి చిత్రాలు నెల‌కొల్పిన  కలెక్షన్స్ రికార్డును కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం 500 కోట్ల దిశ‌గా సాగి ఆ మార్కును ట‌చ్ చేసింద‌ని అంటున్నారు. 

మొత్తానికి ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్ లో ఉన్న చాలా రికార్డుల‌ను ఈ చిత్రం  దాటిపోవడం పక్కా అనే మాట వినిపిస్తోంది. మరిన్ని రికార్డులను క్రియేట్ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. దీని తరువాత షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడైన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి దక్షిణాదిన మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీలో ఇళయ దళపతి విజయ్ కూడా  గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. అందులో సౌత్ ఫ్లేవ‌ర్ లో రూపొందుతున్న  మూవీ కాబట్టి పఠాన్ కంటే ఈ చిత్రం ఎలివేషన్స్ పరంగా ఇతరత్రా మరింత కొత్తగా ఉండబోయే  అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పఠాన్ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో జవాన్ చిత్రానికి సౌత్ ఇండియన్ ప్రేక్షకులు కూడా బ్రహ్మర‌థం  పట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.