Read more!

English | Telugu

'విక్ర‌మ్ వేదా' రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుందా?

హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ న‌టించిన సినిమా విక్ర‌మ్ వేదా. త‌మిళంలో మాధ‌వ‌న్‌, విజ‌య్‌సేతుప‌తి యాక్ట్ చేసిన మూవీ ఆధారంగా తెర‌కెక్కింది. ఈ సినిమాకు మంగ‌ళ‌వారం ఉన్న‌ ప‌ళాన 10 శాతం క‌లెక్ష‌న్లు జంప్ అయ్యాయి. ఐదో రోజు ఆరుకోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి రూ.50కోట్ల క్ల‌బ్‌లో చేర‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. డీసెంట్‌హిట్‌గా పేరు తెచ్చుకున్న సినిమా ఐదు రోజుల్లోనే అంత క‌లెక్ట్ చేస్తే, క‌చ్చితంగా వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరే అవ‌కాశాలున్నాయంటున్నారు నార్త్ ట్రేడ్ పండిట్స్.

బీహార్, వెస్ట్ బెంగాల్‌లో విక్ర‌మ్‌వేదాకి మంచి క‌లెక్ష‌న్లున్నాయి. పైగా ఇప్పుడు ద‌స‌రా రోజులు. వ‌రుస‌గా హాలిడేస్ ఉన్నాయి. బుధ‌వారం కూడా క‌లెక్ష‌న్ల‌లో జంప్ వ‌చ్చి రూ.10కోట్లు క‌లెక్ట్ చేయ‌గ‌లిగితే సినిమా వంద‌కోట్ల రూటు ప‌ట్టిన‌ట్టే. వంద కోట్లు వ‌చ్చినా, రాక‌పోయినా రూ.80-100 కోట్ల మ‌ధ్య మాత్రం క‌లెక్ష‌న్ల మార్క్ ఉంటుందంటున్నారు ట్రేడ్ పండిట్స్.

ఆల్రెడీ త‌మిళ్‌లో హిట్ అయిన స‌బ్జెక్ట్ కావ‌డంతో చాలా మంది సినిమాను చూసేశారు. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే క‌థ‌ కాక‌పోవ‌డం, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌కి సంబంధించిన క‌థ కావ‌డంతోనూ రిపీట్ ఆడియ‌న్స్ మిస్ అవుతున్నారు. ఈ లోపాలు లేకుంటే విక్ర‌మ్ వేదా క‌లెక్ష‌న్లు ఎప్పుడో వంద కోట్ల రూటులో ఉండేవ‌న్న‌ది కొంద‌రి ఒపీనియ‌న్‌.ఇద్ద‌రు తెలివైన వ్య‌క్తులు, అందులో ఒక‌రు పోలీస్‌, ఇంకొక‌రు క్రిమిన‌ల్‌. వాళ్లిద్ద‌రి మ‌ధ్య న‌డిచే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో సాగుతుంది విక్ర‌మ్ వేదా.