English | Telugu

షారుక్ సినిమాలో సేతుప‌తి!

కోలీవుడ్ కెప్టెన్ అట్లీ కుమార్ బాలీవుడ్ బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా త‌న శైలిలో ఓ మాస్ మ‌సాలా మూవీని రూపొందిస్తున్నాడు అట్లీ. ఈ చిత్రంతోనే లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తొలి అడుగేస్తోంది. ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ అతిథి పాత్ర‌లోనూ.. రానా ద‌గ్గుబాటి ఓ కీల‌క భూమిక‌లోనూ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇదే చిత్రంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కూడా ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా సేతుప‌తి న‌టించ‌బోతున్న‌ట్లు వినికిడి. సినిమా హైలైట్స్ లో విజ‌య్ సేతుప‌తి రోల్ కూడా ఒక‌ట‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే షారుక్ - అట్లీ కాంబో మూవీలో విజ‌య్ సేతుప‌తి ఎంట్రీపై క్లారిటీ రానుంది.

కాగా, ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, స‌న్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవ‌ర్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్. రెహ‌మాన్ బాణీల‌ను, కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించ‌బోతున్నారు. అంతేకాదు.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగు భాష‌ల్లోనూ ఏక‌కాలంలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టాక్.