English | Telugu
హాస్పిటల్‌లో ధర్మేంద్ర.. అసలు ఏం జరిగింది!
Updated : Sep 11, 2023
అలనాటి ప్రముఖ హీరో ధర్మేంద్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు మెరుగైన చికిత్స కోసం యుఎస్ ఎ కి తీసుకెళ్లారు సన్నీడియోల్. నిన్నమొన్నటిదాకా గదార్2 ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు సన్నీడియోల్. అమీషాపటేల్ హీరోయిన్‌గా నటించిన గదార్2: దికథా కంటిన్యూస్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరు చూసి కడుపు నిండిపోయిందని, ఇంకెప్పుడూ పాలిటిక్స్ జోలికి వెళ్లనని, భవిష్యత్తు మొత్తం సినిమాల మీదే కాన్‌సెన్‌ట్రేట్ చేస్తానని అన్నారు సన్నీడియోల్. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో ఆసక్తిగా పాల్గొన్న సన్నీడియోల్ ఉన్నట్టుండి విరామం తీసుకున్నారు.
తన తండ్రి ధర్మేంద్రను తీసుకుని యుఎస్ ఎ కి వెళ్లారు సన్నీడియోల్. ధర్మేంద్రకు పర్టిక్యులర్‌గా చెప్పుకోదగ్గ అనారోగ్యం లేకపోయినా, వయసు మీద పడటంతో పలు రకాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయట. అన్నీ టెస్టులు చేయించాలని యుఎస్ ఎ కి తీసుకెళ్లారట సన్నీడియోల్. ఇప్పుడు ధర్మేంద్రకు 87 ఏళ్లు. అందుకే ఒకసారి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించాలని అనుకున్నారట ఇంట్లో వాళ్లు. దాదాపు 15- 20 రోజులు అక్కడే ఉండి, వైద్య పరీక్షలు పూర్తి చేయిస్తారట. తనయుడు సన్నీడియోల్ మాత్రమే కాదు, తండ్రి ధర్మేంద్ర కూడా రీసెంట్‌గా హిట్ అందుకున్న ఆనందంలో ఉన్నారు. కరణ్ జోహార్ సినిమా రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీలో నటించారు ధర్మేంద్ర. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో కీ రోల్ చేశారు ధర్మేంద్ర. ఈ ఏడాది జులై 28న విడుదలైంది రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. ఈ సినిమాలో ధర్మేంద్ర రోల్‌కి మంచి అప్లాజ్ వచ్చింది.