English | Telugu

వ‌రుణ్ - కీర్తి న్యూ మూవీ కంప్లీట్ డీటైల్స్!

వ‌రుణ్ ధావ‌న్ ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో తేలుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన బ‌వాల్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. నితీష్ తివారి తెర‌కెక్కించిన రొమాంటిక్ సినిమా ఇది. ల‌వ్‌, లాఫ్ట‌ర్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో మరో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు వ‌రుణ్‌. ఆయ‌న యాక్ట్ చేయ‌నున్న 18వ సినిమా ఇది. ఆగ‌స్టు సెకండ్ వీక్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. "షూటింగ్ టైమ్ లైన్స్ లాక్ అయ్యాయి. 15 రోజుల షెడ్యూల్‌ని ముంబైలోని స్టూడియోలో ప్లాన్ చేశారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. ఎప్ప‌టి నుంచో బాలీవుడ్ డెబ్యూ చేయాల‌నుకున్న ఆమె క‌ల‌, ఈ సినిమాతో తీర‌నుంది. ఈ చిత్రంలో రొమాంటిక్, డ్ర‌మాటిక్ స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. యాక్ష‌న్ ప్యాక్డ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు అట్లీ. ఈ న‌వంబ‌ర్ ఎండింగ్‌లోపు షూటింగ్ పార్టు కంప్లీట్ చేయాల‌నే సంక‌ల్పంతోనే ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది మేలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవ‌ల్లో బిగ్గెస్ట్ రిలీజ్ చేయాల‌న్న‌ది అట్లీ ప్లాన్‌" అని రివీల్ చేశారు కెప్టెన్ స‌న్నిహితులు.

ఈ సినిమాలో వ‌రుణ్ ధావ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. ఆయ‌న ప్రేయ‌సిగా కీర్తి న‌టిస్తున్నారు. ఇది డ్ర‌మాటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లు, హై ఆక్టేన్ యాక్ష‌న్ సీక్వెన్స్ లు ఉంటాయి. ఈ సినిమాను అట్లీ సమర్పిస్తున్నారు. ఆయ‌న భార్మ ప్రియా అట్లీ కూడా నిర్మాత‌ల్లో ఒక‌రు. సినీ ఒన్ స్టూడియోస్ మురాద్ ఖేతాన్‌తో క‌లిసి ఆమె నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ కంప్లీట్ అయ్యాయి.

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుఖ్ న‌టించిన జ‌వాన్ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో న‌య‌న‌తార‌ను నేష‌న‌ల్ ఆడియ‌న్స్ కి ప‌రిచ‌యం చేసిన అట్లీ, నెక్స్ట్ సినిమాతో కీర్తి సురేష్‌ని ప‌రిచ‌యం చేస్తున్నారు.