Read more!

English | Telugu

'సూర్య‌ 42' హిందీ రైట్స్‌కి య‌మా క్రేజ్‌!

 

సూర్య క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. లేటెస్ట్‌గా ఆయ‌న న‌టిస్తున్న 'సూర్య‌ 42' సినిమా హిందీ రైట్స్ విక్ర‌యించిన తీరు చూస్తుంటే, క‌మ‌ల్ - ర‌జ‌నీ సినిమాల క్రేజ్‌ను సూర్య దాటేసిన‌ట్టే అనే మాట‌లు వినిపిస్తున్నాయి. ప‌ర్టిక్యుల‌ర్‌గా అమౌంట్ ఇంత అని బ‌య‌ట‌కు రాక‌పోయినా, క్రేజీ నెంబ‌ర్ అనే మాట మాత్రం ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది.  

సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు సూర్య‌. 10 భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. యువీ క్రియేష‌న్స్‌తో క‌లిసి కె.ఇ. జ్ఞాన‌వేల్‌రాజా నిర్మిస్తున్నారు. దిశా ప‌టానీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం గోవాలో జ‌రుగుతోంది. 'కోచ్చ‌డ‌యాన్' త‌ర‌హాలో యానిమేష‌న్ సినిమా అని గ‌తంలో వార్త‌లు వినిపించాయి. అయితే అందులో నిజం లేద‌ని, సినిమాను త్రీడీలో తెర‌కెక్కిస్తున్నామ‌ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఫ‌స్ట్ డే షూటింగ్ స్టిల్‌ని అప్ప‌ట్లో దిశా ప‌టానీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే సినిమా కంప్లీట్ అయ్యేవ‌ర‌కు ఆన్‌లొకేష‌న్ స్టిల్స్‌ని ఎక్క‌డా షేర్ చేయ‌వ‌ద్ద‌ని శివ అంద‌రికీ చెప్పార‌ట‌. అందుకే అప్ప‌టి నుంచీ స్టిల్స్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయితే సూర్య‌ని నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌లో చూపించ‌డానికి శివ అన్నీ ప‌నులు కంప్లీట్ చేశార‌ట‌.

త‌న మార్కు యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో వెళ్తూనే, కొత్త‌దనాన్ని ఈ సినిమాలో లావిష్‌గా ఆవిష్క‌రించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట శివ‌.