Read more!

English | Telugu

ఆ ప‌ని చేయ‌నున్న స‌ల్మాన్‌

ఇప్పుడు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌లో టెన్ష‌న్ తెలియ‌కుండానే పెరిగిపోతుంది. అందుకు కార‌ణం త‌న‌కు ఇప్పుడు క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఆయ‌న త‌న ఆశ‌ల‌న్నీ టైగ‌ర్ 3 చిత్రం పైనే పెట్టుకున్నారు. ఈ మూవీ న‌వంబ‌ర్ 12న రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతుంది. సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచ‌టానికి స‌ల్మాన్ అండ్ టీమ్ ఓ ప‌ని చేయ‌టానికి రెడీ అయిపోయారు. ఇంత‌కీ స‌ల్మాన్ ఖాన్ ఏ ప‌ని చేయ‌బోతున్నారు?  టైగ‌ర్ 3తో స‌ల్మాన్ ఖాన్ హిట్ కొడ‌తాడా?  లేదా? అనే వివ‌రాల్లోకి వెళితే...

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘టైగర్ 3’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్ చిత్రాల్లో భాగంగా ఈ మూవీ న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో రిలీజ్ కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ ట్రైల‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమా నుంచి ఇప్పుడు ‘లేకే ప్ర‌భు కా నామ్ ..’ పాటను విడుదల చేయటానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ పాట‌కు సంబంధించిన సాంగ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సాంగ్ టీజ‌ర్ ప్రోమోను గ‌మ‌నిస్తే.. స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పీక్స్‌లో ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక సాంగ్ ఫుట్ ట్యాపింగ్‌లా ఉంది. చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్‌గా లేకే ప్ర‌భు కా నామ్ మెప్పిస్తుంద‌ని క్లియర్‌గా తెలుస్తుంది. అమితాబ్ భ‌ట్టాచార్య రాసిన ఈ పాట‌ను అర్జిత్ సింగ్, నికితా గాంధీ పాడారు. పూర్తి సాంగ్ అక్టోబ‌ర్ 23న రిలీజ్ కానుంది. ఈ పాట ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్‌కు ఫీస్ట్‌గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు.

య‌ష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివ‌ర్స్‌లో ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ ఏక్ థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఈ రెండు సినిమాల‌కు కొన‌సాగింపుగా టైగ‌ర్ 3 సంద‌డి చేయ‌నుంది. వెర్స‌టైల్ యాక్ట‌ర్ ఇమ్రాన్ హ‌ష్మి ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో టైగ‌ర్ 3 రిలీజ్ కానుంది. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.