English | Telugu
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంత ప్రమాదం రానుందో చూపించనున్న 'ద క్రియేటర్'
Updated : Jul 17, 2023
గారేత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేసిన 'ద క్రియేటర్' రెండో ట్రైలర్ వచ్చింది. యంత్రాలతో మనుషుల పోరాటాన్ని ఈ మూవీలో మనం చూడబోతున్నాం. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ సీన్స్, వయోలెన్స్ తో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ తెలియజేస్తోంది. యుద్ధ ప్రమాదం పొంచి ఉన్నభవిష్యత్తు నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో లాస్ ఏంజెల్స్ పై ఒక అణు క్షిపణిని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పేల్చింది. ఏ బాంబు కంటే కూడా ప్రమాదకరమైన ఆయుధం దాని చేతిలో ఉంది. ట్విస్ట్ ఏమంటే, ఆ ఆయుధం ఆల్ఫీ (నూతన బాలనటి యూనా ఓయల్స్ పోషించింది) అనే ఒక చిన్న పాప రూపంలో రావడం!
ప్రత్యర్థి దళాల ఉక్కు పట్టు నుంచి ఆ బాలికను బయటకు తెచ్చే అసాధ్య కార్యాన్ని పూర్తి చేసే టాస్క్ఎక్స్-స్పెషల్ ఫోర్సెస్ ఏజెంట్ జాషువా (జాన్ డేవిడ్ వాషింగ్టన్) మీద పడుతుంది. ఆ పాపను క్రియేట్ చేసిన వారెవరో కనిపెట్టి, వారిని నిర్మూలించే పని కూడా అతనిదే.
"నేను ఒక పర్సన్ ని కాదు" అని ఒక సందర్భంలో ఆల్ఫీ అనడం చూస్తాం. అంటే తనకు స్వర్గంలో చోటు లేదని చెప్తుందన్న మాట. ఈ మధ్యలో జాషువా, ఆల్ఫీ మధ్య అనుబంధం పెనవేసుకుంటుంది కూడా. సమయం వచ్చినప్పుడు ఆమెనుఅతనుధ్వంసం చేయగలడా? అనేది ప్రశ్న.
ఆకాశంలో వేలాడుతున్న అనేక స్పేస్ స్టేషన్స్, అత్యంత వేగంగా దూసుకుపోతున్నస్పేస్ షిప్స్, బ్లాస్ట్ అవుతున్నట్యాంక్స్ .. ట్రైలర్ లో వీటిని చూస్తుంటే ఎంతో క్వాలిటీతో 'ద క్రియేటర్'ను నిర్మించారని అర్థమవుతోంది. నేపథ్యంలో మనకు గుడులు, వరిపొలాలు కూడా కనిపిస్తున్నాయి. 'అపోకలిప్స్ నౌ', 'ఏలియన్స్' లాంటి సినిమాల ప్రభావం తన మీద ఉందని డైరెక్టర్ ఎడ్వర్డ్స్ అంటాడు. సైన్స్ ఫిక్షన్ మూవీగా 'ద క్రియేటర్'ను రూపొందించడంలో ఆప్రభావంకచ్చితంగా ఉందని మనం భావించవచ్చు. సెప్టెంబర్ 29నఈ మూవీ అమెరికాలో విడుదలవుతోంది.