English | Telugu
పెళ్లిళ్ల పేరమ్మగా తమన్నా!
Updated : Aug 17, 2021
త్వరలో తమన్నా పెళ్లిళ్ల పేరమ్మగా తెర మీదకు రానుంది. హిందీ సినిమా 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా మిల్క్ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఇతరులు పెళ్ళికి ఓకే అనేలా... ప్రేమలో పడేలా చూసే అమ్మాయిగా కథానాయిక కనిపిస్తుందని, ఆమె ప్రేమలో పడాలని కోరుకోదని ఈ సినిమాలో తన పాత్ర గురించి తమన్నా వివరించింది. ఈ సినిమాలో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.
తమన్నాది కమర్షియల్ కథానాయిక కటౌట్! ఐదు పాటలు... ఆరు సన్నివేశాలు ఉన్న పాత్రలు చాలా చిత్రాల్లో చేసింది. తెరపై అందాల బొమ్మగా కనిపించింది. అటువంటి తమన్నా ఇప్పుడు కొత్త రూటులో ప్రయాణం చేయడం ప్రారంభించింది. ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ కూడా ప్రయోగాలు చేసే విధంగా ఆమెను ప్రోత్సహించింది. నెట్ ఫ్లిక్స్ కి తమన్నా చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఆమె ఫస్ట్ ఓటీటీ మూవీ కూడా ఇదే. ఇంతకు ముందు తమన్నా ఓటీటీ కోసం '11 అవర్', 'నవంబర్ స్టొరీ' వెబ్ సిరీస్ లు చేసింది.