English | Telugu

సంపాద‌న‌లో 10 శాతం వారికేనంటున్న స‌న్నీలియోన్‌!

స‌న్నీలియోన్ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. లేటెస్ట్‌గా ఆమె చేసిన ప్ర‌క‌ట‌న విని `వావ్ మేడ‌మ్‌, వండ‌ర్‌ఫుల్‌. మిమ్మ‌ల్ని చూసి త‌ప్ప‌కుండా చాలా మంది ముందుకొస్తారు` అని పొడుగుతున్నారు ఫ్యాన్స్. స‌న్నీలియోన్ చేస్తున్న మంచి ప‌నికి ఆమె భ‌ర్త డేనియ‌ల్ వెబెర్ కూడా స‌పోర్ట్ చేస్తున్నారు. వారిద్ద‌రూ క‌లిసి ఈ విష‌యాన్ని రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. స‌న్నీలియోన్‌, ఆమె భ‌ర్త డేనియ‌ల్ వెబెర్ క‌లిసి త‌మ ఫిబ్ర‌వ‌రి సంపాద‌నలో 10 శాతాన్ని ట‌ర్కీ, సిరియాలో స‌ర్వంపోగొట్టుకున్న‌వారి స‌హాయార్థం ప్ర‌క‌టించారు.

త‌మ కాస్మ‌టిక్ బ్రాండ్‌లో వ‌చ్చే సంపాద‌న‌లోనూ 10 శాతాన్ని ఇస్తామ‌ని అన్నారు. దీని గురించి స‌న్నీలియోన్ మాట్లాడుతూ ``భూకంప బాధితుల గురించి చూస్తుంటే క‌డుపు త‌రుక్కుపోతోంది. వాళ్ల‌కు మ‌న చేత‌నైన సాయం చేద్దాం. మ‌నం వారికి ఉన్నామ‌నే భ‌రోసాను క‌ల్పిద్దాం. ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల్సిన స‌మ‌యం ఇది. అవ‌స‌రంలో ఉన్న‌వారిని ఆదుకోవాలి. భూకంప బాధితుల కోసం ప్ర‌తి ఒక్క‌రూ త‌ర‌లిరావాలి`` అని అన్నారు. డేనియ‌ల్ మాట్లాడుతూ ``ట‌ర్కీ, సిరియాలో జ‌నాలు ప‌డుతున్న ఇబ్బందులు చూస్తే చాలా బాధ‌గా అనిపించింది. ఇలాంటి స‌మ‌యంలో కేవ‌లం మ‌న సానుభూతి వారి క‌న్నీళ్లు తుడ‌వ‌లేదు. మేం ఉన్నామ‌నే భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌గాలి.

మాన‌వ‌తాదృక్ప‌థంతో ప్ర‌తి ఒక్క‌రూ స్పందించాలి. మా ఫిబ్ర‌వ‌రి సంపాద‌న‌లో, సేల్స్ లో 10 శాతాన్ని చారిటీస్‌కి ఇస్తున్నాం. అవ‌స‌రంలో ఉన్న‌వారిని ఆదుకుంటాం`` అని అన్నారు. స‌న్నీలియోన్‌లాంటి సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తే, అభిమానులు కూడా త‌మ ఉదార‌త‌ను చాటుకోవాల‌నే ఆలోచ‌న చేస్తారంటున్నారు నెటిజ‌న్లు. రీసెంట్‌గా విష్ణు సినిమాలో న‌టించారు స‌న్నీలియోన్‌. తెలుగులో ఇటీవ‌ల సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన జంబ‌ల‌కిడి జారుమిఠాయా పాట‌కు స్టెప్పులేశారు స‌న్నీ.