Read more!

English | Telugu

యానిమల్ లోని కొన్ని విషయాలు నచ్చలేదని చెప్పే హక్కు ఉంది..ప్రముఖ అగ్ర హీరో 

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా యానిమల్ మూవీ భారతదేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులని సృష్టిస్తు తన పనిలో తాను ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు యానిమల్ బాగోలేదని ఎంత నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసినా కూడా ఫలితం లేదు. మరికొన్ని రోజుల్లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ మూవీలు సాధించిన 1000 కోట్ల క్లబ్ లో కూడా యానిమల్ చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒకప్పటి అగ్ర హీరో యానిమల్ మూవీలోని కొన్ని సీన్స్ నచ్చలేదంటు ఇప్పుడు చెప్పడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

హిందీ చలన చిత్ర సీమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నటుడు సన్నీడియోల్..లేటెస్ట్ గా గదర్ 2 తో కూడా ఆయన సంచలన విజయాన్ని అందుకొని నేటి తరం కుర్ర హీరోలకి సవాలు విసురుతున్నాడు. ఈయన ఎవరో కాదు యానిమల్ లో అబ్రార్ క్యారెక్టర్లో విధ్వంసం సృష్టించిన బాబిడియోల్ కి స్వయానా అన్నయ్య. తాజాగా సన్నీడియోల్  యానిమల్ గురించి మాట్లాడుతు యానిమల్ మూవీలోని  కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. ఒక్కోసారి నా సొంత సినిమాలోని  విషయాలని కూడా ఇష్టపడనని  అలాగే  ఏదైనా ఒకదానిని ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడానికి తనకు పూర్తి హక్కు కూడా ఉందని ఆయన తెలిపాడు. చివరకి మాత్రం యానిమల్ సినిమా నాకు బాగా నచ్చిందని కూడా సన్నీ డియోల్ చెప్పుకొచ్చాడు.

అలానే యానిమల్ లో తన సోదరుడు బాబీడియోల్ పోషించిన పాత్ర పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని  కూడా  ఆయన చెప్పాడు. ఇప్పుడు యానిమల్ మూవీ పై సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.