English | Telugu

స్త్రీ 2 షూటింగ్ మొదలైంది

రాజ్ కుమార్ రావు హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా స్త్రీ2. స్త్రీ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది. సినిమా షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని టీజర్ విడుదల చేసి అనౌన్స్ చేసింది టీం. హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2018లో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన విమర్శలు ఎదురయ్యాయి. అదే సమయంలో ఈ సినిమా బావుందని మెచ్చుకొని హిట్ చేసిన‌ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో స్త్రీ సినిమా బ్లాక్ బస్టర్ అనే పేరు తెచ్చుకుంది.

ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. వాళ్ళందరూ సీక్వెల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేస్తున్న సినిమా స్త్రీ2. ఈ ఏడాది మార్చి నుంచి ఈ సినిమా గురించి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా స్త్రీ2. షూటింగ్ని సెట్స్ మీదకి తీసుకెళ్లారు మేకర్స్. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జియో స్టూడియోస్, దినేష్ విజన్ ప్రొడక్షన్ టీం నిర్మిస్తోంది. పంకజ్ త్రిపాఠి ,అపరిశక్తి పురాణ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో కనిపిస్తారు. గత సినిమాలో లేని సర్‌ప్రైజ్‌లు ఈ పార్ట్ లో ప్లాన్ చేశారు మేకర్స్.

షూటింగ్ ప్రారంభోత్స‌వాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన స్త్రీ 2 టీజర్ లో పలు ఆసక్తికరమైన విషయాలు వున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేస్తారనే విషయాన్ని ఇందులోనే అనౌన్స్ చేశారు మేకర్స్. ఓ స్త్రీ కల్ ఆన 2018 అంటూ గోడ మీద రాసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ఓ స్త్రీ రక్షకరణ 2024 అంటూ అక్షరాలు మార‌డం టీజర్ లో అందంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్టు భూమిపడ్నేకర్ ఓ పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు. వరుణ్ ధావన్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తార‌నే మాటలు వినిపిస్తున్నాయి. హారర్ యూనివర్స్ లో క్యారెక్టర్లు కలవడం అనేది స్త్రీ2. లోనే జరుగుతుంది అని అంటున్నారు విమర్శకులు.