English | Telugu

వామ్మో... శంక‌ర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!


ఒక‌టి త‌ర్వాత రెండు అంటే లేట్ అవుతుంద‌ని, ఒక‌టీ, ఒక‌టీ రెండూ అంటున్నారు శంక‌ర్‌. లెక్క‌ల్లోనే కాదు, ప్రాజెక్టుల విష‌యంలోనూ అంతే ప‌క్కాగా ఉంటున్నారు ఈ కోలీవుడ్ డైర‌క్ట‌ర్‌. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ద‌ర్శ‌కులు ప్యాన్ ఇండియా కాన్సెప్టులు ఆలోచించ‌కముందే, సోష‌ల్ అవేర్‌నెస్‌ని , క‌మ‌ర్షియ‌ల్ కాన్సెప్టుల‌ను మిక్స్ చేసి మూవీస్ చేసిన డైర‌క్ట‌ర్ శంక‌ర్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్ హీరోగా, కియారా అడ్వానీ హీరోయిన్‌గా, దిల్‌రాజు సంస్థ‌లో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. భారీ వ్య‌యంతో రూపొందుతున్న ఈ సినిమాకు గేమ్ చేంజ‌ర్ అని ఇటీవ‌ల టైటిల్ అనౌన్స్ చేశారు. 2024 జ‌న‌వ‌రికి గేమ్ చేంజ‌ర్‌ని తీసుకొచ్చే స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు రీసెంట్‌గా దిల్‌రాజు చెప్పారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే ఇండియ‌న్‌2ని కూడా మరోవైపు చేసేస్తున్నారు శంక‌ర్. క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్ కీ రోల్స్ చేస్తున్న ఇండియ‌న్2 సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఫారిన్‌లో జ‌రుగుతోంది. ఈ దీపావ‌ళికి విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. మ‌రి 2024 సంక్రాంతికి బ‌రిలోకి వ‌స్తుందా? స‌మ్మ‌ర్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి రెండు ప్రాజెక్టులు ఉండ‌గానే, ముచ్చ‌ట‌గా మూడో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెడుతున్నారు శంక‌ర్‌. బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించే సినిమాను మూడు పార్టులుగా తీయాలన్న‌ది శంక‌ర్ సంక‌ల్పం. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాల‌నుకుంటున్నారు శంక‌ర్‌. ఇప్పుడు సెట్స్ మీదున్న ఇండియ‌న్‌2 పూర్తి కాగానే ర‌ణ్‌వీర్ సింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట డైర‌క్ట‌ర్‌. అందుకే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా మొద‌లుపెట్టేశార‌ట‌. ఆల్రెడీ ఒక టీమ్ దానిమీద ఫోక‌స్ పెట్టింద‌న్న‌ది వార్త‌.