Read more!

English | Telugu

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్.. రిలీజ్ డేట్ వచ్చింది

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ మొదటిసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. సినిమా టైటిల్ ని, రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

20 ఏళ్ల కెరీర్ లో ఇప్పటిదాకా ఐదు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హిరానీ దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీంతో ఆయనతో సినిమాలు స్టార్ హీరోలు ఆశపడుతుంటారు. షారుఖ్ ఖాన్ కూడా అలాగే ఆశపడుతున్నట్లు తాజాగా మూవీ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో షారుఖ్.. రాజ్ కుమార్ సినిమాల పోస్టర్స్ చూస్తుండగా.. రాజ్ కుమార్ అక్కడికి వస్తాడు. అప్పుడు షారుఖ్.. 'సంజు గా రణబీర్ కపూర్, పీకేగా ఆమిర్ ఖాన్, మున్నాభాయ్ గా సంజయ్ దత్ ఐకానిక్ క్యారెక్టర్స్ లో నటించారు. సార్ నాకోసం ఏదైనా ఉందా?' అని అడగగా.. 'ఒక స్క్రిప్ట్ ఉందని' రాజ్ కుమార్ చెప్తాడు. దీంతో హ్యాపీగా ఫీలైన షారుఖ్.. 'కామెడీ, ఎమోషన్, లవ్ అన్నీ ఉంటాయా' అని అడగగా.. ఉంటాయని చెప్తాడు రాజ్ కుమార్. దీంతో మరింత హ్యాపీగా ఫీలైన షారుఖ్ సినిమా టైటిల్ ఏంటని అడుగుతాడు. రాజ్ కుమార్ 'డంకి' అని చెప్పగా.. డాంకీ అనుకోని ఉలిక్కిపడిన షారుఖ్ ఆ తర్వాత 'డంకి' అని తెలుసుకొని రిలాక్స్ అవుతాడు. 

అంతేకాదు జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 22, 2023 న విడుదల చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు.