English | Telugu

స‌మంత రియ‌ల్ వారియ‌ర్ అంటున్న క‌బీర్‌!

క‌బీర్ దుహాన్ సింగ్ చెబుతున్న కొన్ని మాట‌లు స‌మంత అభిమానుల‌కు స‌రికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. జీవితంలో చిన్న చిన్న వాటికే ఇబ్బందిప‌డుతున్న చాలా మందిలో ఆశ‌ల్ని నింపుతున్నాయి. స‌మంత న‌టించిన లేటెస్ట్ సినిమా శాకుంత‌లం. దేవ్‌మోహ‌న్ హీరోగా న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. దిల్‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. నీలిమ గుణ నిర్మాత‌. ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 14న విడుద‌ల కానుంది శాకుంత‌లం. కొంత‌మందికి ప్రీమియ‌ర్ షోలు వేశారు. నెట్టింట్లో మిశ్ర‌మ స్పందన క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌మంత‌తో ప‌నిచేయ‌డం గురించి, శాకుంత‌లం సినిమా గురించి చాలా విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు క‌బీర్ దుహాన్ సింగ్‌. త‌మిళ్‌, తెలుగు, క‌న్న‌డ‌లో చాలా సినిమాల‌కు ప‌నిచేసిన‌ప్ప‌టికీ, ఇది త‌న‌కు చాలా స్పెష‌ల్ సినిమా అని అన్నారు క‌బీర్‌సింగ్‌.

స‌మంత గురించి మాట్లాడుతూ ``స‌మంత వారియ‌ర్‌. సెట్‌లో చాలా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటుంది. స్క్రీన్ మీద మ‌నంద‌రం ఆరాధించే స్టార్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఆమెకు చాలా బాగా తెలుసు. నా దృష్టిలో ఆమె చాలా గొప్ప ఫైట‌ర్‌. డెర్మ‌టోమ‌యోసైటిస్‌తో ఆమె ఎంత బాధ‌ప‌డిందో మన‌కు తెలుసు. అయితే, త‌న అనారోగ్యం కార‌ణంగా ఎప్పుడూ షూటింగుల‌ను ఇబ్బందిపెట్ట‌లేదు. క్ర‌మం త‌ప్ప‌కుండా ఆమె షూటింగ్‌లో పాల్గొనేవారు. ఆమె చాలా స్ట్రాంగ్ విమెన్‌. శాకుంత‌లం సినిమాలో చాలా అందంగా క‌నిపిస్తారు`` అని అన్నారు.

ఈ చిత్రంలోనే కాదు, ఫ్యామిలీమేన్‌2లోనూ ఆమె ప‌నితీరు చాలా బాగా న‌చ్చింద‌ట క‌బీర్‌కి. ఎలాంటి పాత్ర‌నైనా అంత క‌న్విన్సింగ్‌గా చేయ‌డం చాలా మందికి చేత‌కాదు. అయితే స‌మంత చాలా అవ‌లీల‌గా చేస్తారు అని అన్నారు. శాకుంత‌లంలో తాను అసుర‌రాజుగా న‌టించాన‌ని చెప్పారు. దేవ్ మోహ‌న్‌తో యుద్ధంలో పార్టిసిపేట్ చేశాన‌ని తెలిపారు. ఈ సినిమాలో తాను ధ‌రించిన కాస్ట్యూమ్స్ చాలా బాగా న‌చ్చాయ‌ని అన్నారు. పౌరాణికాల్లో న‌టించ‌డం ఎప్పుడూ పాజిటివ్‌గా అనిపిస్తుంద‌ని చెప్పారు క‌బీర్‌.