Read more!

English | Telugu

ఒక్క ముద్దుతో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ 

బాలీవుడ్ సినిమా హీరోల తీరంతా ఒక ఎత్తైతే సీనియర్ బ్రహ్మచారి సల్లు భాయ్  తీరు మాత్రం ఇంకోఎత్తు. రెండున్నర దశాబ్దాలపై నుంచి  ఆన్ ది స్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్ రెండింటిలోను సల్మాన్  సంచలనం సృష్టిస్తూనే వస్తున్నాడు.ఎవరు ఏం అనుకున్నా పర్లేదు తనకి నచ్చింది చెయ్యడం  ఖాన్ భాయ్ స్పెషాలిటీ. ఇదే కోవలో సల్మాన్ తాజాగా చేసిన ఒక పని భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది.

సల్మాన్ తాజాగా గోవాలో జరుగుతున్న 54  వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యాడు. సల్మాన్ ఫెస్టివల్ జరిగే ప్రాంగణం మొత్తం తిరుగుతు తనకి తెలిసిన వాళ్ళని పలకరిస్తు ఉన్నాడు.ఈ క్రమంలో సల్మాన్ కి ఒక లేడీ సీనియర్ రిపోర్టర్ కనిపించింది. దీంతో సల్మాన్ ఆ రిపోర్టర్ ని బాగున్నారా అంటు ఆప్యాయంగా పలకరించి దగ్గరకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సదరు లేడీ రిపోర్టర్ కూడా సల్మాన్ తనకి ముద్దు పెడుతున్నప్పుడు నవ్వుతు సరదగానే ఉంది.

 సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా వచ్చిన టైగర్ 3 తో వరుస పరాజయాల నుంచి బయటపడ్డాడు. వరల్డ్ కప్ ఫీవర్ నుంచి బయటపడిన టైగర్ ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  మంచి వసూళ్లనే సాధిస్తు ఉంది. ఇప్పుడు  సల్మాన్ ముద్దు  విషయం బాగా వైరల్ అవుతున్న దృష్ట్యా టైగర్ 3 ఫ్రీ పబ్లిసిటీతో కలెక్షన్ లని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.