English | Telugu
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సల్మాన్-కత్రినా!
Updated : Aug 20, 2021
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'టైగర్'. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు 'ఏక్ థా టైగర్' (2012), 'టైగర్ జిందా హై' (2017) ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమా 'టైగర్ 3'' షూటింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కత్రినా కైఫ్.. ఈ మూడో సినిమాలోనూ నటిస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న ఈ మూవీకి మనీశ్ శర్మ దర్శకుడు.
ఇంతకుముందు ఇంటర్నేషనల్ షూట్ షెడ్యూల్ కోసం యూనిట్ మెంబర్స్‌తో కలిసి సల్మాన్, కత్రినా రష్యాకు విమానంలో వెళ్తారనీ, ఆదిత్య చోప్రా తన చార్టర్ విమానంలో వెళ్తారనీ రిపోర్టులు వచ్చాయి. రష్యాలో 45 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత సల్మాన్-కత్రినా టర్కీ, ఆస్ట్రియా సహా మరో ఐదు ఇంటర్నేషనల్ లొకేషన్లకు వెళ్తారనీ తెలిసింది.
సల్మాన్ ఖాన్ ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకునే ముందు అక్కడ కత్రినా కైఫ్ కెమెరా కళ్లకు దొరికేసింది. కంఫర్టబుల్ బ్లాక్ సూట్‌లో ఆమె కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేముందు మీడియా సిబ్బంది ఆమెను గుర్తించారు. ఆమె ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాలకే సల్మాన్ ఖాన్ అక్కడకు వచ్చాడు. బ్లాక్ టీ-షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్, రెడ్ స్నీకర్స్ ధరించాడు సల్మాన్. ఆ ఇద్దరు స్టార్లు రష్యాకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే అధికారిక ఇన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది. 'టైగర్ 3'లో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు.