Read more!

English | Telugu

సల్మాన్ ఖాన్ కాంపౌండ్ లోకి రష్మిక 

చాలా గట్టి  ముహుర్తానే  రష్మిక  కన్నడ సీమ నుంచి తెలుగుసీమకి అడుగుపెట్టింది.నూటికి నూరుపాళ్లు చాలా గట్టి   ముహుర్తానే  అడుగుపెట్టింది. తెలుగులో ఓవర్ నైట్ స్టార్.. హిందీలో ఓవర్ నైట్ స్టార్.. మళ్ళీ ఇప్పుడు హిందీలోనే తనకి ఒక బడా ఆఫర్ వచ్చింది. అది కనుక హిట్ అయితే ఇక రష్మిక ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ అయినట్టే. ఆ విషయంలో ఎవరు  ఎలాంటి డౌట్స్ ని  పెట్టుకోవాల్సిన అవసరం లేదు 

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సికందర్. నెక్స్ట్ మంత్ జూన్ నుంచి షూటింగ్ కి వెళ్లనుంది. హీరోయిన్ గా రష్మిక ఆల్ మోస్ట్  కన్ఫర్మ్  అయినట్టే.ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుంది.  ముందు  పలువురు హీరోయిన్ల  పేర్లు పరిశీలించినప్పటకి యూనిట్ మొత్తం రష్మిక వైపే  మొగ్గు చూపించినట్టుగా తెలుస్తుంది.ఇక   రష్మిక కి ఈ ఆఫర్  మంచి అవకాశం అని చెప్పవచ్చు.సల్మాన్ లాంటి టాప్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే తన స్థాయి  మరింతగా ఎస్టాబ్లిష్ అవుతుంది.ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగుదాస్ సికందర్ కి దర్శకత్వం వహిస్తుండగా        సాజిద్ నడియావాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు 

రష్మిక 2022 లో బాలీవుడ్ లో తెరకెక్కిన గుడ్ బై తో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసింది. అమితాబ్ బచ్చన్ ,నీనా గుప్తా వంటి  స్టార్స్ కూడా అందులో  ఉన్నారు. కానీ ఆ మూవీ  పరాజయం పాలయ్యింది. ఇక ఆ తర్వాత 2023 లో  సిద్దార్ధ్ మల్హోత్రా తో కలిసి  మిషన్ మజ్ను చేసింది. అది కూడా పరాజయం పాలయ్యింది. కాకపోతే ఆ రెండు సినిమాల ప్లాప్ వల్ల రష్మిక కి వచ్చిన నష్టమేమి లేదు.  యానిమల్ తో భారీ విజయాన్ని అందుకొని బాలీవుడ్ కి చాలా గట్టిగానే ఇచ్చింది. దాంతో  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు సికందర్ హిట్ అయితే  కనుక ఇక ఆమెని ఆపడం ఎవరి తరం కాదు.పైగా  తన అప్ కమింగ్ మూవీస్  పుష్ప 2,  ది గర్ల్ ఫ్రెండ్, కుబేర  కూడా  హిందీలోను  డబ్ అవుతున్నాయి