English | Telugu

రాణి కుమార్తె ఏం చేస్తోంది? ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్!

తాను షూటింగ్ చేసే స‌మ‌యంలో త‌న కుమార్తె అస‌లు గుర్తురాద‌ని చెప్పారు రాణీముఖ‌ర్జీ. ఆమె చెప్పిన ఈ మాట‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. మిసెస్ చ‌ట‌ర్జీ వ‌ర్సెస్ నార్వే సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రాణీ ముఖ‌ర్జీ చాలా విష‌యాల‌నే షేర్ చేసుకుంటున్నారు. అందులోనూ మిసెస్ చ‌ట‌ర్జీ వ‌ర్సెస్ నార్వే మూవికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో హ్యాపీ స్పేస్‌లో ఉన్నారు రాణీ.

రాణి పెర్ఫార్మెన్స్ సూప‌ర్‌గా ఉందంటూ కితాబిస్తున్నారు సెల‌బ్రిటీలు. స్క్రీన్ మీద ఈ సినిమాలో అమ్మ‌గా న‌టించారు రాణీ ముఖ‌ర్జీ. రియ‌ల్ లైఫ్లోనూ ఆమె అమ్మ‌నే. లైమ్‌లైట్‌కి దూరంగా త‌న కుమార్తెను పెంచుతున్నారు రాణీముఖ‌ర్జీ. అయినా కూతురుతో ఆమెకున్న అనుబంధం ఎవ‌రికీ తెలియ‌నిదేం కాదు. ఇటీవ‌ల త‌న సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగానూ కూతురి గురించి చాలా విష‌యాల‌నే చెప్పుకొచ్చారు రాణీముఖ‌ర్జీ. క‌రీనా క‌పూర్ చాట్ షో వాట్ విమెన్ వాంట్‌లో పాల్గొన్నారు రాణీముఖ‌ర్జీ. మిసెస్ చ‌ట‌ర్జీ వ‌ర్సెస్ నార్వే సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌న పాప అధీరా అస‌లు గుర్తుకు రాలేద‌ని అన్నారు రాణీ.

దీని గురించి మాట్లాడుతూ ``నన్ను నేను అలాంటి సిట్చువేష‌న్‌లో క‌నీసం ఊహించుకోలేను. అందుకే నాకు ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో నా కూతురు గుర్తురాలేదు. కానీ మా అమ్మ గుర్తుకొచ్చింది. న‌న్నుగానీ, నా సోద‌రుడిని గానీ ఎవ‌రైనా ఆమె నుంచి దూరం చేసి ఉంటే, మా అమ్మ ఎలా ప‌రిత‌పించేదోన‌ని అనుకున్నాను. నా గుండె బ‌రువెక్కిపోయింది. ఇలాంటి సిట్చువేష‌న్ ఏ మ‌హిళ జీవితంలోనూ రాకూడ‌దు. మ‌రీ ముఖ్యంగా ఇది నాకే వ‌స్తే మెంట‌లెక్కిపోతాను`` అని అన్నారు రాణీ. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ల‌లోనూ సూప‌ర్‌డూప‌ర్‌గా ఆడుతోంది మిసెస్ చ‌ట‌ర్జీ వ‌ర్సెస్ నార్వే. మ‌న‌తో పోలిస్తే అంత‌ర్జాతీయ వేదిక‌ల‌మీద ఈ సినిమాకు మ‌రింత క్రేజ్ ఉంది. మై రాణీ ఈజ్ బ్యాక్ అంటూ సినిమా గురించి, రాణీ ముఖ‌ర్జీ గురించి ట్విట్ట‌ర్‌లో రాశారు షారుఖ్‌ఖాన్‌.