Read more!

English | Telugu

అది నచ్చే ఆ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాను

బాలీవుడ్ లో టాప్ హీరోల్లో రణబీర్ కపూర్ కూడా ఒకడు. తన తండ్రి రిషి కపూర్ లాగానే రణబీర్ కూడా తన కెరీర్ మొదటి నుంచి లవ్ సినిమాలనే ఎక్కువగా చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు లో కొంచం కమర్షియల్ లుక్ లో కనపడినా కూడా ఆ సినిమా రణబీర్ కి పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ మాత్రం కాదు. ఇప్పుడు యానిమల్ అనే సినిమాతో రణబీర్ పక్కా కమర్షియల్ హీరోగా రాబోతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యానిమల్ సినిమాని అసలు ఎందుకు ఒప్పుకున్నాననే విషయాన్ని రణబీర్ వెల్లడి చేసాడు.

సందీప్ రెడ్డి వంగ డైరక్షన్ లో గతంలో వచ్చిన కబీర్ సింగ్ అలాగే తెలుగు అర్జున్ రెడ్డి మూవీలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. కానీ వాటి వల్లే సందీప్ తో సినిమా చెయ్యడానికి నేను ఒప్పుకోలేదు. సందీప్ నాకు యానిమల్ కథని చెప్పిన విధానంతో పాటుగా మూవీ స్క్రిప్ట్ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని రణబీర్ పేర్కొన్నాడు. అలాగే నాలో ఉన్న మరొక యాంగిల్ ని ప్రేక్షకులకి చెప్పడానికి కూడా ఈ మూవీ దోహద పడిందని చెప్పుకొచ్చాడు. యానిమల్ తర్వాత సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు కూడా రణబీర్ తెలిపాడు.

డిసెంబర్  1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న యానిమల్ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.రణబీర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలని చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది.