English | Telugu
పరిణీత చోప్రా వెడ్డింగ్ డేట్ లాక్ అయింది!
Updated : Aug 20, 2023
పరిణీతి చోప్రా వెడ్డింగ్ డేట్ లాక్ అయింది. పొలిటీషియన్ రాఘవ్ చద్దాతో ఆమె నిశ్చితార్థం ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 25న వివాహ వేడుకతో ఒక్కటవనున్నారు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రం హాజరు కానున్నారు.
``చాలా గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. పరిణీతి దీని గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని మాకు ఆర్డర్ వేశారు. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిని ప్రెస్టీజియస్‌గా తీసుకుని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఆమె కాల్షీట్‌ని కూడా ఆల్రెడీ అడ్జస్ట్ చేశారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పరిణీతి పెళ్లి పనులకు సమయం కేటాయిస్తున్నారు. గురుగామ్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారు`` అని డీటైల్స్ లీక్ చేసింది పరిణీతి టీమ్.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం ఉదయ్‌పూర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌తో వివాహానికి ఏర్పాటు చేస్తున్నారు. 2018లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రీ వెడ్డింగ్ ఫెస్టివల్ ఇక్కడే జరిగింది.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఎంగేజ్‌మెంట్ మే 13న న్యూఢిల్లీలోని కపుర్తల హౌస్‌లో జరిగింది. ఈ నిశ్చితార్థానికి ముందు వారిద్దరూ ఎప్పుడూ పబ్లిక్‌లో తమ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడలేదు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పలు సందర్భాల్లో ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో కలిసి కనిపించేవారు. ఐపీయల్ మ్యాచ్‌లలోనూ కలిసి కనిపించేవారు.