English | Telugu
నిర్మాతగా మారిన డార్లింగ్ జానకి!
Updated : Jul 5, 2023
కృతి సనన్‌కి సోషల్ మీడియాలో నాన్‌స్టాప్‌గా విషెస్ అందుతున్నాయి. గత కొన్నివారాలుగా ఆమె నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ప్రభాస్ పక్కన నటించిన ఆదిపురుష్‌తో ఆమె పేరు మారుమోగిపోయింది. అందులో నుంచి కాస్త బ్రేక్ వచ్చిందని అనుకుంటుండగానే ఇప్పుడు మరో విషయాన్ని బ్లాస్ట్ చేశారు కృతి. ఆమె అభిమానులకే కాదు, ఇండస్ట్రీ కార్మికులకు కూడా అది శుభవార్తే. అందుకే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కృతిసనన్ కొత్తగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారన్నదే ఆ న్యూస్. బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ అని సరికొత్త బ్యానర్‌ని స్టార్ట్ చేశారు. దీన గురించి ఆమె సోషల్ మీడియాలో మంచి పోస్ట్ పెట్టారు. ``గేర్ మార్చే సమయం వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో నేను తొమ్మిదేళ్లుగా ఉన్నాను. ప్రతి విషయాన్నీ నేర్చుకున్నాను. ఎదిగాను. చేస్తున్నాను. ఇంకా చాలా చేయాలనిపిస్తోంది. చాలా కథలు వినాలనిపిస్తోంది. వాటిలో నటించాలనిపిస్తోంది.
కొన్ని మనసుకు మరీ దగ్గరగా అనిపిస్తున్నాయి. అలాంటివాటిని నిర్మించాలనిపిస్తోంది. నాకు నచ్చిన కథలు, మీకు కూడా నచ్చుతాయనే నమ్మకం ఉంది. నా జర్నీలో ఇదో కొత్త అధ్యాయం. ఎగ్జయిటింగ్‌గా ఉంది`` అని అన్నారు. అంతటితో ఆగకుండా, సమ్‌థింగ్ స్పెషల్‌ని రేపు అనౌన్స్ చేస్తానని ఊరించారు. దీంతో సెలబ్రిటీల నుంచి కూడా కృతికి మంచి విషెస్ అందుతున్నాయి. వరుణ్ ధావన్, సిద్ధాంత్ కపూర్, హ్యూమా ఖురేషి ఇలా వరుసగా ఆమెను విష్ చేస్తున్నారు. పరిశ్రమలోని ప్రతి విభాగం గురించి తెలుసుకున్నారు కృతి. వచ్చే ఏడాది కృతి ఇండస్ట్రీకి పరిచయమై పదేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.