English | Telugu

కియారా భాబీ అయ్యారంటూ నెటిజ‌న్లు కామెంట్స్!

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అడ్వానీ మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. మా ప‌ర్మ‌నెంట్ బుకింగ్ అయిపోయింది అంటూ సిద్‌, కియారా ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఒక‌రి బుగ్గ‌పై ఒక‌రు ముద్దుపెట్టుకుని ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 7న జై సల్మేర్‌లో వీరి వివాహం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 4నే వ‌ధూవ‌రులు కుటుంబ‌స‌భ్యుల‌తో అక్క‌డికి చేరుకున్నారు. మెహందీ, హ‌ల్దీ కార్య‌క్ర‌మాలు వైభ‌వంగా జ‌రిగాయి. దాదాపు ఆరు కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఈ పెళ్లి వేడుక‌ను నిర్వ‌హించారు. పెళ్లికి కొన్ని రోజుల ముందుకూడా సిద్ ఈ విష‌యం గురించి నోరు విప్ప‌లేదు. మీడియా వ‌ర్గాలు అడిగినా చిరు న‌వ్వు నవ్వి వెళ్లిపోయారు. వీరిద్ద‌రూ క‌లిసి షేర్షా సినిమాలో న‌టించారు.

తెర‌మీద వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంద‌ని అంద‌రూ ప్ర‌శంసించారు. ఇప్పుడు రియ‌ల్ లైఫ్లోనూ ఒక్క‌ట‌య్యారు. ఆ మ‌ధ్య వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని, ప్రేమ జంట విడిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఇద్ద‌రూ ఒకే ఇంట్లో క‌నిపించ‌డంతో ఆ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ద‌క్షిణాదిన సినిమాలు చేయ‌లేదు. కానీ కియారా విన‌య‌విధేయ‌రామాలో న‌టించారు. భ‌ర‌త్ అనే నేను సినిమాలో మ‌హేష్‌తో న‌టించారు. ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. అటు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా మిష‌న్ మ‌జ్నులో న‌టించారు. ఈ సినిమాలో ర‌ష్మిక నాయిక‌గా న‌టించింది. ఇప్పుడు సినిమాల‌న్నీ ప్యాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల‌వుతున్నాయి. సిద్ధార్థ్ - కియారా పెళ్లికి బాలీవుడ్ నుంచి కొంద‌రు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఈ ఏడాది నార్త్ లో ఇంత వైభ‌వంగా జ‌రిగిన ఫ‌స్ట్ పెళ్లి ఇదే. కియారా భాబీ అయ్యారంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. నూత‌న దంప‌తుల‌కు సెల‌బ్రిటీల నుంచి అభిమానుల నుంచి, ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ ప‌లుసార్లు వెకేష‌న్ల‌కు క‌లిసే వెళ్లిన ఈ జంట తొలిసారి రాజ‌స్థాన్ నుంచి దంప‌తులుగా బ‌య‌ట‌కురానున్నారు.