English | Telugu
సెట్‌కి లేట్‌గా వచ్చాడని హీరోని తిట్టిన కియారా!
Updated : Jun 22, 2023
పెళ్లవడానికి ముందూ, పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమాత్రం తేడా లేని నాయిక కియారా అద్వానీ. వెకేషన్‌కి వెళ్లొచ్చినంత తేలిగ్గా మ్యారేజ్‌ని ప్లాన్ చేసి, కంప్లీట్ చేసుకుని, మళ్లీ పనిలో పడిపోయారు కియారా. ఆమె నటించిన సత్య ప్రేమ్ కీ కథ సినిమా ఈ నెల్లోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. హీరో కార్తిక్ ఆర్యన్ గురించి అభిమానులతో చాలా విషయాలను పంచుకున్నారు. కియారా మాట్లాడుతూ ``కార్తిక్ తో ఇంతకు ముందు భూల్ భులయ్యా2లో నటించాను. ఆ సమయంలో ప్రతి రోజూ కార్తిక్ సెట్‌కి లేట్‌గా వచ్చేవాడు. నాకు చిరాకు వచ్చేసేది. ఒకరోజు గట్టిగా తిట్టాను. ఇంతింత సేపు నన్ను వెయిట్ చేయిస్తే బాగోదని అన్నాను. భూల్ భులయ్యా కాంబోని రిపీట్ చేస్తామని నా దగ్గరకు ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను కార్తిక్ కి అదే విషయం చెప్పాను.
నన్ను సెట్స్ లో వెయిట్ చేయించకూడదని ముందే కండిషన్ పెట్టాను. సరేనన్నాడు. చెప్పినట్టే చేశాడు. భూల్ భులయ్యా టైమ్‌తో పోలిస్తే, ఈ సినిమాకి మేమిద్దరం ప్రొఫెషనల్‌గా ఎదిగాం. పర్సనల్‌గానూ చాలా ఎదిగాం. అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. మా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతారు`` అని అన్నారు. ఈ సినిమాలోని సన్‌సజ్ని పాట విడుదలైంది. పాకిస్తాన్ ట్యూన్‌కి దగ్గరగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సత్య ప్రేమ్ కీ కథ మ్యూజికల్ డ్రామా. సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహించారు. జూన్ 29న విడుదల కానుంది. ఎన్ జీ ఈ, నమః పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కియారా ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్ పక్కన గేమ్ చేంజర్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్2 కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలన్నది ప్లాన్. మరి అలాంటప్పుడు శంకర్ రెండు సినిమాలనూ ఒకే సీజన్‌కి తీసుకొస్తారా అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న విషయం.