Read more!

English | Telugu

క‌త్రినా-విక్కీ హ‌ల్దీ వేడుక ఇలా జ‌రిగింది!

 

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ ఈ నెల 9న రాజ‌స్థాన్‌లో స‌వాయ్ మాధోపూర్‌లో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన పెళ్లి ఫొటోలు ఆన్‌లైన్‌లో ఎంత వైర‌ల్ అయ్యాయో తెలిసిందే. పెళ్లి దుస్తుల్లో ఉన్న క‌త్రినా నుంచి చూపు తిప్పుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న‌ట్లుగా ఆమె మెరిసిపోయింది. ఆమె పెళ్లి దుస్తుల్ని డిజైన్ చేసింది సెల‌బ్రిటీల ఫేవ‌రేట్ అయిన స‌వ్య‌సాచి.

Also read:  క‌త్రినా-విక్కీ రాయ‌ల్ వెడ్డింగ్ వెనుక ఉన్న బ్యాచ్ ఇదే!

కాగా భ‌ర్త విక్కీతో క‌లిసి చేసుకున్న హ‌ల్దీ వేడుక‌కు సంబంధించిన స్ట‌న్నింగ్ ఫొటోల‌ను లేటెస్ట్‌గా క‌త్రినా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఆ వేడుక‌లోనూ ఆమె స‌వ్య‌సాచి డిజైన్ చేసిన లెహంగా, ఆర్గంజా దుప‌ట్టాలో అద‌ర‌గొడుతోంది. క‌త్రినా ధ‌రించిన జ్యూయెల‌రీని డిజైన్ చేసింది కూడా స‌వ్య‌సాచినే. 

స‌వ్య‌సాచి అఫిషియ‌ల్ పేజ్ కూడా క‌త్రినా కైఫ్ హ‌ల్దీ వేడుక‌కు సంబంధించిన పిక్చ‌ర్స్‌ను పోస్ట్ చేసింది. "హ‌ల్దీ వేడుకలో స‌వ్య‌సాచి ఆర్గండీ లెహంగా, ఆర్గంజా దుప‌ట్టాను క‌త్రినా కైఫ్ ధ‌రించింది." అని అందులో రాసుకొచ్చారు. విక్కీ సైతం స‌వ్య‌సాచి డిజైన్ చేసిన ఎంబ్రాయిడ‌రీ ఖాదీ కుర్తా, స‌ల్వార్‌లో ఆక‌ట్టుకున్నాడు. ఈ వేడుక‌ను క‌త్రినా త‌ల్లి సుసాన్ తుర్‌కొట్టే, సిస్ట‌ర్స్ న‌టాచ‌, మెలిస్సా బాగా ఎంజాయ్ చేసిన‌ట్లు ఫొటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

Also read:  క‌త్రినా-విక్కీ వెడ్డింగ్ ఫుటేజ్‌కు రూ. 100 కోట్ల ఆఫ‌ర్ చేసిన ఓటీటీ దిగ్గ‌జం!

కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న క‌త్రినా, విక్కీ బ‌య‌ట ఎక్క‌డా త‌మ రిలేష‌న్‌షిప్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా గోప్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఆఖ‌రుకి తాము పెళ్లి చేసుకొనే ముందు కూడా ఆ విష‌యాన్ని వారు బ‌హిర్గ‌తం చేయ‌లేదు.