English | Telugu
ప్రియాంక రూట్లో కత్రినా... రీప్లేస్ చేస్తున్న కియారా!
Updated : Jul 4, 2023
ఫర్హాన్ అక్తర్ సినిమా జీ లే జరా అనౌన్స్ చేసి రెండేళ్లు కావస్తోంది. ప్రియాంక చోప్రా, ఆలియా భట్, కత్రినా కైఫ్‌తో క్రేజీ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. అయితే, ఈ ముగ్గురు కథానాయికలు ఎవరికి వారు బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ డిలే అయింది. అసలు ఈ సినిమా, ఇలాంటి సినిమా కావాలని ఇనిషియేట్ చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి ఔట్ అయ్యారన్నది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం. ప్రియాంక ప్రాజెక్టులో లేరని తెలిసి కత్రినా కైఫ్ కూడా డీల్ కేన్సిల్ చేసుకున్నారట. ఆలియా మాత్రం స్టిల్ స్టిక్ ఆన్ అయ్యారన్నది న్యూస్. వెళ్లిపోయిన ఇద్దరి స్థానంలో అనుష్క శర్మ, కియారా అద్వానీని రీప్లేస్ చేసి సినిమా చేయడానికి ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారు. రెసెంట్‌గా పెళ్లిళ్లు చేసుకున్న ఆలియా, కియారా, ఎక్స్ పీరియన్స్‌డ్ ఇల్లాలు అనుష్క కలిసి చేసినా ప్రాజెక్టుకు అంతే క్రేజ్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.
అంతగా ప్రాజెక్టును ఇష్టపడ్డ ప్రియాంక చోప్రా అసలు ఎందుకు బయటపడ్డారని ఆరాతీస్తే కారణం ఆలియా అని అర్థమైందట. ప్రియాంకకు నియర్ ఫ్యూచర్‌లో కాల్షీట్లు లేవట. ఒకవేళ సర్దుబాటు చేద్దామన్నా, ఆ రోజుల్లో ఆలియా అసలు ఖాళీగా లేరట. ఇలాగే లేట్ చేస్తూ పోతే ప్రాజెక్ట్‌కి క్రేజ్ ఉండదని భావించి అలా డిసైడ్ చేశారట ప్రియాంక చోప్రా. అటు ఆలియా కూడా 2024లో రామాయణతోనూ, మరో ప్రాజెక్టుతోనూ చాలా బిజీగా ఉంటారట. అందుకే కాల్షీట్లు సర్దుదామని ప్రయత్నించినా కుదరలేదట. ఆ విషయాన్నే ఫ్రెండ్లీగా ప్రియాంకతో చెప్పేశారట. ఆల్రెడీ హాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు ప్రియాంక. ఇప్పుడు హార్ట్ ఆఫ్ స్టోన్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఆలియా.