Read more!

English | Telugu

సేమ్ క్యాలెండర్ ఇయర్ లో.. 'జవాన్' స్టార్ హ్యాట్రిక్ ప్లాన్!

ప్రస్తుతం 'జవాన్'గా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో.. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు షారుక్. గురువారం విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. డే 1 కలెక్షన్ల పరంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 

ఇదిలా ఉంటే, 'జీరో' (2018) తరువాత మళ్ళీ హీరో పాత్రలో ఎంటర్టైన్ చేయడానికి నాలుగేళ్ళకు పైగా విరామం తీసుకున్న కింగ్ ఖాన్.. 2023లో రీఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన 'పఠాన్'తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన షారుక్.. సెప్టెంబర్ 7న రిలీజైన 'జవాన్'తో మరో సంచలన విజయం తన ఖాతాలో జమ చేసుకున్నాడు. కట్ చేస్తే.. ఇదే ఏడాది క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న 'డంకీ'తో పలకరించేందుకు సిద్ధమయ్యాడు మిస్టర్ ఖాన్. అపజయమెరుగని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షారుక్ కి జంటగా తాప్సీ నటిస్తోంది. మరి.. 2023లో 'పఠాన్', 'జవాన్' రూపంలో రెండు వరుస విజయాలు అందుకున్న షారుక్.. 'డంకీ'తో సేమ్ క్యాలెండర్ ఇయర్ లో హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.